Rajiv Kapoor aka Chimpu passes away at 58 రాజీవ్ కపూర్ కన్నుమూత.. బాలీవుడ్ లో విషాదం

Rajiv kapoor rishi kapoors brother and raj kapoors son dies at 58

rajiv kapoor, rajiv kapoor dies, rajiv kapoor death, rajiv kapoor family, kapoor family, Randhir Kapoor, Rishi Kapoor, Ram Teri Ganga Maili, Bollywood Actor Rajiv kapoor, Bollywood director Rajiv kapoor, Bollywood producer Rajiv kapoor, Tollywood, Bollywood, movies, Entertainment

Rajiv Kapoor, the younger brother of Randhir Kapoor and Rishi Kapoor passed away on February 9, 2021. Popularly known as Chimpu, his death has been confirmed by late actor Rishi's wife Neetu Kapoor on her Instagram page.

‘రామ్ తేరీ గంగా మైలి’ చిత్ర హీరో రాజీవ్ కపూర్ కన్నుమూత

Posted: 02/09/2021 04:22 PM IST
Rajiv kapoor rishi kapoors brother and raj kapoors son dies at 58

బాలీవుడ్‌ సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. మరీ ముఖ్యంగా కపూర్ కుటంబంలో విషాదం నెలకోంది. 2018 నుంచి వరుసగా కపూర్ కుటంబాన్ని విషాద ఘటనలు తీవ్ర అవేదనకు, అందోళనకు గురిచేస్తున్నాయి, ఇండియన్ లెజెండ్ యాక్టర్ రాజ్ కపూర్ కనిష్ట పుత్రుడు.. బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకత్వ రంగాలలో రాణించిన రాజీవ్ కపూర్ (58) మధ్య వమస్సులోనే తిరిగిరాని లోకాలకు తరలివెళ్లాడు. తీవ్రమైన గుండెపోటుకు గురైన ఆయనను కుటుంబసభ్యులు అసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే అయన తుదిశ్వాస విడిచారు.

తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆయనను అసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని అసుపత్రివర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో రాజీవ్‌ కపూర్‌ ఫోటో షేర్‌ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అదే విధంగా రాజీవ్‌ మృతిపట్ల అన్నయ్య రణధీర్‌ సంతాపం ప్రకటించారు. నేను నా తమ్ముడు రాజీవ్‌ను కోల్పోయాను. అతను ఇక లేడు. వైద్యులు తమ వంతు ప్రయత్నించినా తనను రక్షించుకోలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా దివంగత నటుడు రాజ్‌ కపూర్-కృష్ణ కపూర్‌ల‌కు చిన్న కుమారుడు రాజీవ్‌ కపూర్‌. 2018లో రాజీవ్ కపూర్ పెద్ద సోదరి రీతూ నంద కన్నుమూసింది. ఆ తరువాత గత ఏడాదిలో ఆయన సోదరుడు రిషి కపూర్ కన్నుమూశాడు. ఇక ఇవాళ రాజీవ్ కపూర్ మరణంతో కపూర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. రాజీవ్ కపూర్‌ ‘రామ్‌ తేరి గంగా మెయిలీ’ చిత్రంలోని నరేంద్ర పాత్రతో ప్రసిద్ది చెందారు. ఈ చిత్రం 1985 సంవత్సరంలో విడుదలైంది. ఆయన హిందీ చలనచిత్ర రంగంలోకి ఆరంగ్రేటం చేసింది మాత్రం 'ఏక్ జాన్ హై హమ్' (1983) చిత్రంతోనే, కాగా అయనకు పెద్దగా ఈ చిత్రం బ్రేక్ తీసుకురాలేదు.

దీంతో తన తండ్రి దర్శకత్వంలో రామ్ తేరీ గంగా మైలి చిత్రంలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తరువాత అస్ మాన్ (1984)లోనూ నటించారు. లవర్ బాయ్ (1988), జబర్ధస్ట్ చిత్రంలోనూ ఆయన హీరోగా నటించారు. రిషి కపూర్ కథానాయకుడిగా నటించిన 'ప్రేమ్ గ్రంథ్'కు దర్శకత్వం వహించారు. కాగా గతేడాది రిషీ కపూర్ క్యాన్సర్‌తో కన్నుమూసి.. ఏడాది గడవక ముందే తమ్ముడు రాజీవ్‌ కన్నుమూయడం కపూర్ కుంటుంబానికి తీరాన్ని శోకాన్ని మిగిల్చింది. కాగా రాజీవ్ కపూర్ ఆకస్మిక మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, శ్రేయోభిలాషులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 
 
 
View this post on Instagram

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajiv Kapoor  Randhir Kapoor  Rishi Kapoor  Ram Teri Ganga Maili  Bollywood  

Other Articles