యువనటుడు రాజ్ తరుణ్ హీరోగా, విజయకుమార్ కొండా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పవర్ ప్లే’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా వచ్చిన ఈ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. మధునందన్, అజయ్, రాజారవీంద్ర, పూర్ణ వంటి సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. లవ్, కామెడీ సినిమాలకు కామా పెట్టి "పవర్ ప్లే"తో క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ ఎక్కాడు హీరో రాజ్ తరుణ్. తన గత చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'ను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండ మరోసారి ఈ సినిమాకు డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాడు.
విజయ్ కుమార్ కొండ ఈ సారి కామెడీ జోలికి పోకుండా విభిన్న కథాంశంతో పవర్ ప్లే చేశారు. ఈ సినిమా ట్రైలర్ లో నేరాలు, ఘోరాలే ఎక్కువగా కనబడ్డాయి. ఇదిలా వుంటే రాజ్ తరుణ్ ఈసారి కూడా హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో నటించి మరోసారి రెచ్చిపోయాడు. మరి ఈ పవర్ ప్లేలో చివరికి ఎవరు గెలిచారు? రాజ్ తరుణ్ తన కంటి నుంచి జాలువారిన కన్నీటి బొట్లకు ప్రతీకారం తీర్చుకుంటాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే!.
ఇక ఈ పవర్ ప్లేలో హేమల్ ఇంగ్లే కథానాయికగా కనిపించనుండగా కోటా శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహిధర్, దేవేష్ నిర్మిస్తున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డితో మరో సినిమా చేస్తున్నాడు. ఇందులో బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ కీలక పాత్రలో నటిస్తోంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని మనమాలి క్రియేషన్స్‌పై మహిథర్, దేవేష్ నిర్మిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more