సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య నుంచి మెగా ఫ్యాన్స్ కు కొంచెం ఆలస్యంగా రిపబ్లిక్ డే కానుక అందింది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన తరణం వచ్చేసింది. చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం నుంచి టీజర్ ను స్వయంగా చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రంలో తమ అభిమాన హీరోను అభిమానులు ఎలా చూడాలని అనుకున్నారో.. సరిగ్గా వారి అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా మెగాస్టార్ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ అంచనాలకు మించిన స్థాయిలో కోరటాల శివ చిరంజీవితో యాక్షన్స్ సన్నివేశాలను రూపోందించారు.
‘‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పని లేదు..’’ అన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఎర్రని కండువాను మెడలో వేసుకున్న చిరంజీవి సామాజిక కార్యకర్తగా చూపించనున్నారు. అయితే అన్యాయానికి గురై అణిచివేయబడ్డవారికి నిలవడంతో పాటు ధర్మస్థలిలో జరిగే అక్రమాలను కూడా సరిదిద్దే నాయకుడిగా, గురువుగా చిరంజీవి ఆచార్య పాత్రలో నటించారు. 'పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో 'ఆచార్య' అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో..' అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ తో ముగిసే టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
కోణిదెల సురేఖ సమర్పణలో తెరకక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో నిర్మాత మోగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. కేవలం 20 నిమిషాల నిడివిలో నటించేందకు పూజా హెగ్డే ఏకంగా కోటిన్నర తీసుకుంటుందని సినీవర్గాల బొగట్టా. ఈ చిత్రాన్ని సంగీత మాంత్రికుడు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని ఈ వేసవిలో మే 13వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more