Vishal lands into one more legal trouble హీరో విశాల్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు

Kollywood hero vishal lands into one more legal trouble

Tamil Hero, Vishal, legal issues, Trident Arts, producers, Action movie, Sundar C, shortage of film collections, Chakra, OTT release, Madras High Court, Anandan, Madras HC Notices to Vishal, Kollywood

Tamil actor Vishal landed into one more legal mess after Trident Arts, the producers of his last movie Action approached the Madras High Court and sought the stay on the release of his next film Chakram which is planned for a digital release soon.

హీరో విశాల్ సోంత బ్యానర్ చిత్రం విడుదలకు బ్రేకులు

Posted: 09/23/2020 02:35 AM IST
Kollywood hero vishal lands into one more legal trouble

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన సొంత బ్యానర్ లో నిర్మించి న‌టిస్తోన్న తాజా చిత్రం చ‌క్ర‌ విడుదలకు బ్రేకులు పడ్డాయి. ఓటిటీ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిన తరుణంలో చిత్ర విడుదలను నిలిపివేయాలని తాజాగా మద్రాసు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఏకంగా ఈ చిత్రానికి నిర్మాత, నటుడైన హీరో విశాల్ తో పాటుగా దర్శకుడు ఆనందన్ కు కూడా నోటీసులను జారీ చేసింది. హీరో విశాల్ అంతకుముందు నటించిన ‘యాక్షన్’ చిత్రానికి నిర్మాణ సంస్థగా వ్యవహరించిన ట్రైడెంట్ ఆర్ట్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు ఈ మేరకు తాజా అదేశాలను జారీ చేసింది.

ఆయనతో పాటు ఈ చిత్ర దర్శకుడు ఎంఎస్ ఆనందన్ కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. హీరో విశాల్ కు మంచి బ్రేక్ ఇస్తుందని భావించిన ‘చక్ర’ చిత్రానికి ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బ తగిలింది. దీంతో కనీసం ఓటిటి ద్వారా  విడుదలను ఆపాలంటూ నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ హైకోర్టులో కేసు వేసింది. కేసును పరిశీలించిన మద్రాస్‌ హైకోర్టు విశాల్‌కు, డైరెక్టర్‌ ఆనందన్‌కు నోటీసులను జారీ చేసింది. అసలు హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘చక్ర’ విడుదలకు అంతకుముందు విడుదలైన ‘యాక్షన్’ చిత్రానికి మధ్య సంబంధమేంటీ.? ఆ నిర్మాత ఈ చిత్రాన్ని ఎందుకు అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

అసలు విషయం ఏంట్రీ ఇస్తే.. విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ నిర్మించిన ‘యాక్షన్’ చిత్రాన్ని ఏకంగా రూ.44 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో రూ.20 కోట్ల వరకు హీరో విశాల్‌ గ్యారెంటర్ ఉండేలా అగ్రిమెంట్స్‌ రాసిచ్చాడని అయితే సినిమా హిట్ కాకపోగా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ నష్టాలను భరించడానికి విశాల్‌ తన తదుపరి చిత్రాన్ని ఆనంద్‌ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్ లోనే చేస్తానని హామీ ఇచ్చాడని, అయితే ఇప్పుడు ఆ మాటను తప్పిన హీరో తన సోంత బ్యానర్ లోనే సినిమాను విడుదల చేస్తున్నారని. ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగే వరకు చక్రను అపాలని పిటీషన్ దాఖలు చేయడంతో హైకోర్టు హీరో విశాల్‌, డైరెక్టర్‌ ఆనందన్ కు నోటీసులు పంపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Hero  Vishal  legal issues  Trident Arts  film collections  Sundar C  Madras High Court  Kollywood  

Other Articles