Satyadev turns Thimmarusu వరుస ప్రాజెక్టులతో జోరుమీదున్న సత్యదేవ్..

Satyadev as thimmarusu a new film announced

Satyadev Kancharana, thimmarasu, Assignment Vali, Jyothi Lakshmi, Gurthunda Seethakaalam, Mahesh S Koneru, Srujan Yarabolu. tollywood, entertainment, movies

Satyadev Kancharana urns a thimmarasu, the film is the Telugu adaptation of the Kannada thriller series, Birbal Trilogy Case 1: Finding Vajramuni. Directed by Sharan Koppisetty, the film's title logo along with the caption - Assignment Vali - was released by the makers today.

వరుస ప్రాజెక్టులతో జోరుమీదున్న సత్యదేవ్..

Posted: 09/08/2020 01:50 AM IST
Satyadev as thimmarusu a new film announced

సినిమాల్లో నటించాలన్న ఉత్సాహంతో పాటు అభినయం, అనుకువ వున్న నటీనటులకు ఈ రంగం నిత్యం స్వాగతం పలుకుతుందని ఇప్పటికే చాలా మంది అర్టిస్లులు నిరూపించుకున్నారు. ఎప్పటికప్పుడు కొందరు టాలెంట్ వున్న నటీ నటులు తమ ప్రతిభతో వరుస అవకాశాలను దక్కించుకుంటున్నారు, ఇక తాజాగా ఈ జాబితాలో చేరిన మరో నటుడు సత్యదేవ్. 'ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రం హీరోగా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంతకుముందు కొన్ని సినిమాలలో నటించినా ఈ చిత్రంతో ఆయనలోని టాలెంట్ ప్రేక్షకుల ముందు అవిష్కృతమై.. అభినందలు అందుకోగలిగింది, దీంతో ఆయనతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు, వరస సినిమాలతో ఆయన బిజీగా మారారు, ఇప్పటికే తమన్నా సరసన 'గుర్తుందా శీతాకాలం' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా, సత్యదేవ్ జాబితాలోకి మరో చిత్రం వచ్చి చేరింది, కన్నడలో ప్రేక్షకాధరణ పోందిన చిత్రాన్ని సత్యదేవ్ తో రిమేక్ చేసేందుకు నిర్మాతలు అంగీకారం కుదుర్చుకున్నారు,  ఈ చిత్రం పేరు 'తిమ్మరుసు'. నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. 'ఎస్సైన్ మెంట్ వాలి' అనేది దీనికి ట్యాగ్ లైన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. దీనిని మహేశ్ కోనేరు, సృజన యరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles