Chiranjeevi, Pawan Kalyan condolences to stalwart రావి కొండలరావు మృతి పట్ల చిరంజీవి, పవన్ సంతాపం

Vice president ap cm naidu condole death of film actor ravi kondala rao

Raavi Kondala Rao, senior actor, writer, journalist, Vice President, Venkaiah Naidu, Chandrababu, YS Jagan, Chiranjeevi, Pawan Kalyan, tollywood, movies, entertainment

Vice President of India Venkaiah Naidu, Andhra pradesh Chief Minister YS Jagan Mohan Reddy, Leader of the Opposition in Legislative Assembly N Chandrababu, Megastar of tollywood K. Chiranjeevi, JanaSena Party President Pawan Kalyan condole the death of Telugu veteran actor and writer Raavi Kondala Rao.

కళామతల్లి ముద్దుబిడ్డ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం..

Posted: 07/28/2020 10:23 PM IST
Vice president ap cm naidu condole death of film actor ravi kondala rao

ప్రముఖ నటులు, రచయిత, సాహితీవేత్త, పాత్రికేయుడు, దర్శకనిర్మాత రావి కొండలరావు మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సినీపరిశ్రమ అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడిన నాటకరంగ నిష్ణాతుడు దూరం కావడం తో ఉత్తరాంధ్ర కళాభిమానులు కూడా శోకసంధ్రంలో మునిగారు. ఇక రావి కొండలరావు మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘‘ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీ రావి కొండలరావుగారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, శ్రీ ఏయన్నార్ గారి తర్వాత తెలుగు సినిమా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు నటించిన గొప్ప వ్యక్తి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను..’’ అని వెంకయ్య నాయుడు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రావికొండలరావు మృతి విచారకరం: చంద్రబాబు

 

రావి కొండలరావు గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రావి కొండలరావు మరణం విచారకరం అని ట్వీట్ చేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లుగా కోరారు. ‘‘సీనియర్ నటులు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాప్రపూర్ణ శ్రీ రావి కొండలరావు గారి మరణం విచారకరం. తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో, హాస్యాన్ని జోడించి ఆయన ప్రదర్శించే నటన ఆహ్లాదకరంగా ఉండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..’’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిత్రపరిశ్రమ గొప్ప మేధావిని కోల్పోయింది: చిరంజీవి

 

ప్రముఖ నటులు, రచయిత, జర్నలిస్ట్, ప్రయోక్త రావి కొండలరావు‌గారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళనుండి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించడం జరిగిందని.. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడినే కాదు గొప్ప రచయితను, పాత్రికేయున్ని, ప్రయోక్తను కోల్పోయిందని ఆయన అన్నారు. రావికొండలరావు మరణంతో చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని చిరంజీవి అన్నారు.

‘‘తెలుగు చలనచిత్ర పరిశ్రమతో రావి కొండలరావుగారికి సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను హీరోగా పరిచయం అయిన తొలినాళ్ళనుండి రావి కొండలరావుగారితో పలు చిత్రాల్లో నటించడం జరిగింది. ముఖ్యంగా మా కాంబినేషన్‌లో వచ్చిన చంటబ్బాయి, మంత్రిగారి వియ్యంకుడు వంటి చిత్రాలలో రావి కొండలరావు చాలా కీలక పాత్రలు పోషించారు. రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమతో పాటు నాటక, సాంస్కృతిక రంగాలకు కూడా తీరని లోటు. రావి కొండలరావుగారూ ఆయన సతీమణి రాధా కుమారిగారు జంటగా ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. రావి కొండలరావుగారి మరణంతో చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టు అయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

రావికొండలరావు సేవలు అజరామరం: పవన్ కల్యాణ్

 

‘‘ప్రముఖ నటులు, రచయిత శ్రీ రావి కొండలరావుగారు తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు చిత్రసీమకు శ్రీ కొండలరావుగారు అందించిన బహుముఖ సేవలు అజరామరం. ఆయన మరణం సినీ రంగానికి ఒక లోటు. నాటక రచయితగా, నటుడిగా రంగస్థలానికి, పాత్రికేయుడిగా సినీ జర్నలిజానికి చేసిన సేవలు మరువలేనివి. సినీ రంగంలోని ఎన్నో మలుపులను అక్షరబద్ధం చేశారు. ఆరు దశాబ్దాలకుపైబడి తెలుగు సినీ రంగంతో అనుబంధం కలిగి ఉన్నారు.

విజయ సంస్థతోను, బాపు-రమణలతోను సన్నిహిత సంబంధాలు కలిగిన శ్రీ రావి కొండలరావుగారు నటుడిగా, సినీ కథా రచయితగా తన ముద్రను వేశారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి కథా రచయితగా అందరి ప్రశంసలతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు. అన్నయ్య చిరంజీవిగారు చిత్రాలు ‘మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి’ లాంటి వాటిలో శ్రీ కొండలరావుగారు పోషించిన పాత్రలు అందరికీ గుర్తే. గత యేడాది ఒక పుస్తకావిష్కరణ సభలో వారిని కలిసినప్పుడు సినీ రంగ ప్రస్థానం, మలుపులు గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను..’’ అని పవన్ కల్యాన్ రావి కొండలరావు మృతికి నివాళులు అర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles