Nani's Junnu's Simple Message కరోనా వైరస్ ఎప్పుడు పోతుందో చెప్పిన హీరో తనయుడు

Nani s junnu s simple message loaded with cuteness

coronavirus, Covid-19, LOCKDOWN, Hero Nani, Natural star, Nani Son, Junnu, viral video, video viral, tollywood, movies, entertainment

must watch and listen to the cuteness overloaded message video from Nani’s three-year-old son, Junnu. The natural star uploaded a video on his Twitter wall with Junnu featuring in it. Yes, Junnu has got a message for every one of us.

కరోనా వైరస్ ఎప్పుడు పోతుందో చెప్పిన హీరో తనయుడు

Posted: 04/14/2020 10:54 PM IST
Nani s junnu s simple message loaded with cuteness

ప్రపంచంలో గత రెండు తరాలుగా ఎన్నడూ చూడని విచిత్రమైన ఘటనను ప్రస్తుత తరంతో పాటు రేపటి తరం కూడా వీక్షిస్తోంది. ఆ ఘటనే ప్రపంచంలోని దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడం. ఎందకంటే.. కరోనా వైరస్ మహమ్మారి లక్షమందికి పైగా ప్రాణాలను ఇప్పటికే బలితీసుకుంది. ఈ సంఖ్య రానురాను మరితంగా పెరుగుతోంది. దీంతో దీనిని నియంత్రించేందుకు పలు దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు, సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

కరోనా అప్‌డేట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో వెబ్ సిరీస్, సినిమాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనుల తాలుకూ విషయాలను, వర్కౌట్స్, ఇళ్లు క్లీన్ చేయడం, కుక్ చేయడం వంటి పలు సంగతులను వీడియో రూపంలో ప్రేక్షకులతో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని తన కొడుకు జున్నుల మధ్య కరోనా గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. కరోనా మహమ్మారి పిల్లలను ఎంతలా భయపెడుతుందో, దాని పట్ల పిల్లలకు ఎంత అవగాహన ఉందో జున్ను మాటలు వింటే అర్థమవుతోంది. తన కొడుకుతో కరోనా గురించి మాట్లాడుతున్న వీడియోను నాని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.

నాని: జున్ను బయట ఎవరున్నారు?
జున్ను: కరోనా వైరస్..
నాని: ఇప్పుడు మనమేంచేయాలి?
జున్ను: ఇంట్లోనే ఉండాలి..
నాని: అప్పుడేం జరుగుతుంది?
జున్ను: కరోనా వైరస్.. గో..
నాని: గుడ్.. వెరీ గుడ్..
నాని అడిగిన ప్రశ్నలకు జున్ను ముద్దు ముద్దుగా జవాబులిచ్చిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  Covid-19  LOCKDOWN  Hero Nani  Natural star  Nani Son  Junnu  viral video  video viral  tollywood  

Other Articles

Today on Telugu Wishesh