tollywood senior actor janardhana rao passes away టాలీవుడ్ సీనియర్ నటుడు జనార్థన్ రావు ఇకలేరు

Tollywood celebrities condolences the death of senior actor janardhan rao

janardhan rao, janardhana rao, senior actor Janardhana Rao passes away, janatha garage actor Janardhana Rao died, senior actor, senior charector actor, illness, condolences, guntur, chennai, tollywood, movies, entertainment

Tollywood celebrities expres their grief on the death of senior actor janardhan rao, they express grief and condolence to the actor's family members.

టాలీవుడ్ సీనియర్ నటుడు జనార్థన్ రావు ఇకలేరు

Posted: 03/06/2020 10:12 PM IST
Tollywood celebrities condolences the death of senior actor janardhan rao

తెలుగు సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీనియర్ క్యారెక్టర్ నటుడు జనార్దన్‌రావు ఇవాళ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగళ్ల గ్రామానికి చెందిన జనార్దన్ రావు సినీ, టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. తెలుగులో 1000కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొండవీటి సింహం, అభిలాష, జానకిరాముడు, మజ్ను నుంచి నిన్నటి జనతా గ్యారేజ్ వరకు అనేక చిత్రాల్లో ఆయన నటించారు.

దీంతో పాటు ఆయన ఇటు బుల్లితెరపై కూడా అలరించారు. తలంబ్రాలు, గోకులంలో సీత వంటి సీరియళ్లతో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జనార్దన్ రావు చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. 40 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్ లో జనార్దన్ రావు దిగ్గజాలు ఎన్టీఆర్ సహా అనేకమంది అగ్రహీరోల చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. సౌత్ ఇండియాన్ ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌లో జాయింట్‌ సెక్రటరీగానూ.., కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janardhan rao  senior charector actor  illness  condolences  janatha garage  guntur  chennai  tollywood  

Other Articles