Gripping: Anushka's 'Nishabdham' Trailer Is Out! అంచనాలు పెంచుతున్న అనుష్క 'నిశ్శబ్దం' ట్రైలర్‌

Nishabdham trailer anushka shetty and r madhavan s thriller drama will give you goosebumps

#Nishabdham Trailer #Anushka Shetty #Madhavan #Anjali #Shalini Pandey, Nishabdham, Nishabdham trailer out, Nishabdham trailer video, anushka shetty, R madhvan, Nishabdham movie, Nishabdham trailer reaction, #MichaelMadsen #Subbaraju #Nishabdham Telugu Trailer, Kona Film Corporation, People Media Factory, tollywood, movies, Entertainment

The trailer of the much-anticipated film Nishabdham has finally hit the internet and how. Starring Anushka Shetty and R. Madhavan in lead roles, the film is a thriller drama that will send chills down your spine.

అంచనాలు పెంచుతున్న అనుష్క 'నిశ్శబ్దం' ట్రైలర్‌

Posted: 03/06/2020 08:07 PM IST
Nishabdham trailer anushka shetty and r madhavan s thriller drama will give you goosebumps

అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘నిశ్శబ్దం’ సినిమా ట్రైలర్‌ ఈ రోజు హీరో నాని చేతుల మీదుగా విడుదలైంది. ‘మార్చి 6న మధ్యాహ్నం 12:12 గంటలకు’ విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించిన ఈ సినిమా బృందం సరిగ్గా అదే సమయానికి విడుదల చేసింది. ఈ సినిమా  కోన వెంకట్‌ సమర్పణలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణంలో వస్తోంది. ఈ సినిమాలో మాధవన్‌, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రల్లో నటించారు. అంజలి డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
 
‘అక్కడ చీకట్లో ఎవరో అటాక్ చేశారంట.. కానీ ఎవరో ఎంటో కనిపించలేదంటున్నారు..’ ఆ తరువాత మాధవన్ తెరపై కనిపించగానే ఏదో జరుగుతుందన్న ఉత్కంఠ.. ఈ తరుణంలో అంజలి డైలాగ్స్ 'నేను చెబుతోంది అర్థమవుతుందా?', 'ఓ ఘోస్ట్ ఇదంతా చేస్తోందన్న విషయాన్ని ఒప్పుకోవడానికి నా సెన్సిబిలిటీస్‌ అంగీకరించలేదు' అంటూ ఆమె చెప్పింది. ఇక అనుమానాలు పెంచేలా ‘నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు’ అంటూ వేసిన ప్రశ్న చిత్రంపై అంచనాలను పెంచుతోంది. ఇక ఈ మధ్యలో ఎవరో చనిపోతే అక్కడి క్రిమేషన్ కు హారజైన సుబ్బరాజు పూర్తిగా మెన్ ఇన్ బ్లాక్ మాదిరిగా తయరై.. విషాదంగా తన నల్లని కళ్లజోడుని తీయడం కబడుతోంది.

 ఇక అంజలీ వాయిన్ మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చి.. ఆర్ఫనేజ్ కు వెళ్లిన మాకు సోనాలి గురించి చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. ఇదంతా ఓ పాతికేళ్ల అమ్మాయి ఒక్కతే చేసిందంటావా.? అన్న ప్రశ్నకు ఎవరో తనకు సాయం చేస్తున్నారని అంజలి చెబుతుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, టీజర్‌కు మంచి టాక్‌ వచ్చింది. ట్రైలర్ ను కూడా అంచనాలకు తగ్గట్లుగానే కట్‌ చేశారు. ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లిష్ భాష‌ల్లోనూ విడుదల కానుంది. వచ్చేనెల 2న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆ సినిమా బృందం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh