Ram Charan Launches Manchu Manoj's New Film చెర్రీ చేతుల మీదుగా మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’

Ram charan claps the muhurat shot for manchu manoj s aham brahmasmi

Aham Brahmasmi, Manchu Manoj, MM Arts, Ram Charan, Samuthirakani, priya bhavani Shankar, Manchu Mohanbabu, Aham Brahmasmi news, Aham Brahmasmi launch, Aham Brahmasmi poster, Aham Brahmasmi pictures, Aham Brahmasmi grand launch, Ram Charan Launches Manchu Manojs Comeback Film

Manchu Manoj is making his acting comeback with Aham Brahmasmi. the pan-Indian film will be releasing in Telugu, Hindi, Tamil, Malayalam and Kannada. Directed by debutante Srikanth N Reddy, the first look poster of Aham Brahmasmi featured Manoj in three different variations with a common Tripundra.

మంచు మనోజ్ ‘అహం బ్రహాస్మి’ చిత్రాన్ని క్లాప్ కొట్టిన రాంచరణ్

Posted: 03/06/2020 07:25 PM IST
Ram charan claps the muhurat shot for manchu manoj s aham brahmasmi

సినీనటుడు మంచు మోహన్‌ బాబు కుమారుడు మనోజ్ హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమా షూటింగ్‌ ఇవాళ ఉదయం హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మెగాపవర్ స్టార్..  హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చెర్రీకి మంచు కుటుంబం సాదర స్వాగతం పలికింది. రాంచరణ్ రాగానే పూజా కార్యక్రమాలు పూర్తైన వెంటనే ప్రముఖ నటుడు, నిర్మాత.. కలెక్షన్ కింగ్ గా తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న మోహన్ బాబు.. రాంచరణ్ మెడలో పూల దండ వేసి సత్కరించారు.

ఆ వెంటనే రాంచరణ్ కూడా మోహన్ బాబు నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. తరువాత మంచు మనోజ్ పై రామ్‌ చరణ్ ముహూర్తం షాట్ కు క్లాప్‌ కొట్టి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. మంచు లక్ష్మితో పాటు సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్‌-ఆన్‌ చేశారు. తన కూతురితో కలిసి మంచు లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది. మంచు మనోజ్ మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకుడిగా శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ తనకు నిజమైన స్నేహితుడని మంచు మనోజ్ తెలిపాడు. కష్టాలు వచ్చినప్పుడు మద్దతుగా నిలుస్తూ అండగా ఉండేవాడే స్నేహితుడని.. మంచి రోజులను మరింత అద్భుతంగా మార్చేవాడే నిజమైన స్నేహితుడని అన్నాడు. తన స్నేహితులకు, వారి కుటుంబ సభ్యులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పాడు. స్నేహితుడి నుంచి కుటుంబ సభ్యుడిగా మారిన చరణ్ తనకు నిజమైన స్నేహితుడని తెలిపాడు. మంచు మనోజ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మాస్మి' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రొడక్షన్ వర్క్ ను రామ్ చరణ్ ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా ఈ మేరకు స్పందించాడు. 'అహం బ్రహ్మాస్మి' తొలి ప్రొడక్షన్ వర్క్ ను తన సోదరుడు రామ్ చరణ్ ప్రారంభించబోతున్నాడని... చరణ్ కు తమ టీమ్ సాదరంగా స్వాగతం పలుకుతోందని చెప్పాడు. చరణ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపాడు. మూడేళ్ల గ్యాప్ తరువాత తీస్తున్న పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh