Nani negitive role in ‘V’ movie twist revealed ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

Nani s v secret behind the killer drama s title revealed

nani v, v movie, v telugu movie, v teaser, v trailer, nani v teaser, nani v trailer, sudheer babu, V, nani, sudheer babu, Nivetha Thomas, Aditi Rao Hydari, Mohana krishna Indraganti, Amit Trivedi, dil raju, v movie, v movie music, nani movies, telugu movies, entertainment, tollywood

Director Mohan Krishna Indraganti got inspired by a serial killer from the US, who is known for leaving his initial at the murder spots after committing the crimes. V is the name of a company in the film, owned by Nani. Due to some bad influencers, the company loses all its credibility and Nani kills them all.

‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

Posted: 02/24/2020 08:36 PM IST
Nani s v secret behind the killer drama s title revealed

న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి హిట్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరితో ఆయన చేసిన చిత్రాలు వైవిధ్యభరితమైనవిగా నిలిచాయి. అలాంటి ఇంద్రగంటి ఈ ఇద్దరితో కలిసి 'వి' సినిమా చేశాడు. పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని ఇప్పటికే రివీల్ చేశారు.

హీరోగా దూసుకుపోతున్న నానీ, విలన్ పాత్రను చేయడానికి కారణం కొత్తగా కనిపించడం కోసమేనని అనుకున్నారు. కానీ ఈ పాత్రకి సంబంధించిన ఒక అనూహ్యమైన ట్విస్ట్ ఉందట. అది క్లైమాక్స్ లో రివీల్ అవుతుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. ఆడియన్స్ ఎవరూ ఊహించని విధంగా ఆ క్లైమాక్స్ ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే ఈ పాత్రను చేయడానికి నాని అంగీకరించాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా ఈ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచే విషయమే. మార్చి 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, నివేద థామస్ .. అదితీరావు నాయికలుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh