‘అల వైకుంఠపురంలో’ సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం నెలకొంది. బన్నీ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గుండెపోటుతో మరణించారు. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్ కన్నుమూశారు. అల్లు అర్జున్ తల్లి నిర్మలాదేవికీ రాజేంద్ర ప్రసాద్ స్వయానా అన్నయ్య. బన్నీకి పెద్ద మామయ్య. బన్నీకి ప్రసాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. తమ కుటుంబానికి దగ్గరగా ఉండే ప్రసాద్ చనిపోయారని తెలియడంతో అల్లు ఫ్యామిలీ విజయవాడకు బయల్దేరారు.(బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బన్నీ సినిమా)
బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే బన్నీ మేనమామ ప్రసాద్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఆయన కూడా ఓ నిర్మాతగా ఉన్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు రెగ్యూలర్ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఆయన హఠాన్మరణం చెందారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో మూవీ బాక్సీఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతుంది. విడుదలైన పది రోజుల్లోనే రూ. 200 కోట్లు రాబట్టి బన్నీ కెరీర్లోనే ఆల్ టైమ్ రికార్డ్ సాధించి.. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more