Rajini's “Darbar” joins 200 crore club ! రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

Super star rajinikanth s darbar joins 200 crore club

Superstar Rajinikanth, Rajinikanth Darbar, Darbar box office collections, Darbar Rs 200 cr club, Darbar 13 day collections, Darbar worldwide collections, Darbar tamil nadu collections, Darbar rest of india collections, Darbar telugu states collections, Darbar karnataka collections, Darbar kerala collections, Darbar US collections, Kollywood, tollywood, movies, Entertainment

Superstar Rajinikanth’s ‘Darbar’ had a grand release on January 9 during Pongal . The film, which released in Tamil, Telugu, and Hind, is enjoying a good run in the box office. Now a report on an online portal stated that the Rajinikanth’s starrer took 13 days to cross the Rs 200 crore mark at the worldwide box office.

రూ.200 కోట్ల క్లబ్ లోకి రజనీ ‘దర్భార్’.!

Posted: 01/22/2020 06:53 PM IST
Super star rajinikanth s darbar joins 200 crore club

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఖాతాలో మరో రూ.200 కోట్ల సినిమా చేరింది. ఆయన పోలీసు అధికారిగా నటించిన సినిమా ‘దర్బార్‌’. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకుడు. నయనతార, నివేదా థామస్‌, సునీల్‌ శెట్టి, యోగిబాబు తదితరులు దీనిలో కీలక పాత్రలు పోషించారు. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకోవడంతోపాటు బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిందని విశేష్లకులు పేర్కొన్నారు. తమిళనాడులో దాదాపు రూ.80 కోట్లు, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.20 కోట్లు వసూలు చేసింది.

ఇక హిందీ వెర్షన్‌లో రూ.8 కోట్లు సాధించిందని చెప్పారు. విదేశాల్లో దాదాపు రూ.70 కోట్లు రాబట్టిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రజనీ సినీ కెరీర్‌లో నాలుగు సినిమాలు రూ.200 కోట్ల క్లబ్‌లో చేరాయి. ‘రోబో’, ‘కబాలి’, ‘2.ఓ’, ‘పేట’ సినిమాలు ఈ ఘనతను సృష్టించాయి. ఇప్పుడు వీటి జాబితాలో ‘దర్బార్‌’ కూడా చేరింది. మరోపక్క రజనీ-మురుగదాస్‌ కలిసి మరో ప్రాజెక్టు కోసం పనిచేసే అవకాశం ఉందని వదంతులు ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. తలైవా ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. కీర్తి సురేష్‌, ఖుష్బూ, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh