Allu Arjun's film inches closer to Rs 150 crore అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

#AlaVaikunthapurramuloo, samajavaragamana video song, Allu Arjun, Pooja Hegde, Ala Vaikunthapurramuloo box office collections, Ala Vaikunthapurramuloo Rs 200 cr club, Ala Vaikunthapurramuloo 10 day collections, Ala Vaikunthapurramuloo worldwide collections, Ala Vaikunthapurramuloo tamil nadu collections, Ala Vaikunthapurramuloo rest of india collections, Ala Vaikunthapurramuloo telugu states collections, Ala Vaikunthapurramuloo US collections, Trivikram, Thaman S, Ala Vaikunthapurramuloo news, Ala Vaikunthapurramuloo censor report, Ala Vaikunthapurramuloo latest updates, Ala Vaikunthapurramuloo latest news, Tollywood, movies, entertainment

The Allu Arjun starrer film Ala Vaikunthapurramuloo has earned approx Rs 143.2 crores down south. Film critic Ramesh Bala took to his Twitter handle to present a region wise breakdown of the South Indian Box office figures.

అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ రికార్డ్ ‘అలా వైకుంఠపురంలో’.!

Posted: 01/22/2020 05:51 PM IST
Allu arjun s ala vaikunthapurramuloo 10 days share 143 not out

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు వద్ద తెగ సవ్వడి చేస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 220 కోట్ల క్లబ్ లో చేరి దుమ్మురేపుతోంది. అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం పది రోజులైనా ఏమాత్రం జోరును తగ్గకుండా దూసుకెళ్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సందడి చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని, ఇది ఆల్‌ టైమ్‌ రికార్డని చిత్రయూనిట్ తెలిపింది. కేవలం పదిరోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో రూ.143 కోట్లు (షేర్స్‌) రాబట్టినట్లు చెప్పారు. ఇది నాన్‌ బాహుబలి-2 రికార్డ్‌ అని వారు పేర్కొన్నారు. నిజాంలో రూ.35.69 కోట్లు, సీడెడ్ లో రూ.18.07 కోట్లు, వైజాగ్ లో రూ.18.80 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, తూర్పుగోదావరిలో రూ.9.89 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.7.65 కోట్లు, కృష్ణాలో రూ.8.80 కోట్లు, నెల్లూరులో రూ.4.07 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.112.90 కోట్లు వసూలు చేసింది.

ఇక కర్ణాటకలో రూ.10.70 కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, అల్లుఅర్జున్‌ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అల..వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటించారు. టబు, రాజేంద్రప్రసాద్‌, మురళీశర్మ, సుశాంత్‌, నివేదా పేతురాజు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ అందించిన సుస్వరాలు కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh