'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన ఆర్టిస్టులలో 'సుడిగాలి' సుధీర్ ఒకరు. ఒకప్పుడు ఆయన స్కిట్ చూసేందుకే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారంటే అతిశయోక్తి కాదు. బుల్లి తెర నుంచి వెండితెరకు నటులు వెళ్తున్న తరుణంలో బిత్తిరి సత్తి తరువాత క్యూ కడుతూ వెళ్తున్న మరో నటుడు.. సుడిగాలి సుధీర్. ఇప్పటి వరకు ఎవఇంతవరకూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను పోషిస్తూ వచ్చిన సుధీర్, ఇప్పుడు హీరో అయ్యాడు.
తన అదృష్టాన్ని సిల్వర్ స్ర్కీన్ పై పరీక్షించుకోనున్నాడు. బుల్లితెరపై తనను ఆదరించిన ప్రేక్షకులు వెండితెరపై కూడా ఆశీర్వదిస్తారని కొండంత ఆశగా ఎదురుచూస్తూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నాడు. ఆయన హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమా నిర్మితమైంది. శేఖర్ రాజు నిర్మించిన ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరించాడు.
ధన్యాబాలకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సుధీర్ తన మార్కు కామెడీతో బాగానే నవ్వించనున్నాడనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇంద్రజ .. నాజర్ .. సాయాజీ షిండే .. పోసాని .. పృథ్వీ .. తాగుబోతు రమేశ్ .. విద్యుల్లేఖ రామన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more