Mahesh Babu heaps praises on Karthi's Khaidi రూ.50 కోట్ల క్లబ్ లోకి ‘ఖైదీ’.. ‘ప్రిన్స్’ ప్రశంసలు..

This riveting sequence from karthi s khaidi is winning the internet

Karthi’s Khaidi, Karthi's Khaidi Movie Highlight Scene, whistle, video, Lokesh Kanagaraj, khaidi, karthi, Kaithi, Sam CS, Sri Sathya Sai ArtsKollywood, Tollywood, movies, entertainment

With no heroine, no star attraction and no promotions whatsoever, the dark road-thriller which released opposite Vijay’s Whistle in the Telugu states is performing exceedingly well both at the single screens and multiplexes.

‘ఖైదీ’లో ఈ సీన్ వైరల్.. మహేష్ బాబు ప్రశంసలు..

Posted: 11/02/2019 03:15 PM IST
This riveting sequence from karthi s khaidi is winning the internet

కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కార్తీకి, 'ఖైదీ' ఫలితం ఊరటనిచ్చింది. దళపతి విజయ్ విజిల్ చిత్రంతో పోటీ పడి నిలుస్తుందా.? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కొత్త తరహా కథకథనం వుంటే ప్రేక్షకాదరణ లభిస్తుందని మరోమారు రుజువు చేసింది. దీంతో అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో ఈ సినిమా కార్తీకి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా 'విజిల్' పోటీని తట్టుకుని నిలబడింది.

అంతేకాదు వారం రోజులకి పైగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా దూసుకుపోతోంది. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఒక్క తమిళనాడులోనే 25 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇలా దేశవ్యాప్తంగా 40 కోట్లకి పైగా .. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. కొత్తగా విడుదలైన సినిమాల పోటీని తట్టుకుని కూడా ఈ సినిమా రన్ అవుతుండటం విశేషం. ఇక ఈ చిత్రంపై సినీ అగ్రహీరోలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.


'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్‌తో బిజీగా వున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తీరిక సమయంలో తాను కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన కార్తీ ఖైదీ చిత్రాన్ని వీక్షించారు. అంతేకాదు.. సినిమా చూసిచూడగానే తన మనస్సులోని మనోభావాలను తన అభిమానులతో పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా కార్తి నటించిన ఖైదీపై ప్రశంసలు కురిపించారు. ఇది కొత్త తరహా చిత్రం అని.. అద్భుత నటనతో పాటు అదిరిపోయే ఫైట్స్.. దీనికి తోడు పాటలు లేకుండా సినిమా రావడం.. అది మంచి అవ్వడం ఆహ్వానించదగ్గ మార్పు అని మహేష్ ఖైదీ చిత్ర బృందాన్ని కొనియాడారు. కార్తీ ప్రధాన పాత్రలో ఖైదీ అటు తమిళం ఇటు తెలుగులో కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karthi  Karthi's Khaidi  Highlight Scene  Sam CS  Lokesh Kanagaraj  Sri Sathya Sai Arts  tollywood  

Other Articles