Few scenes of Vijay Bigil deletes నిడివి తగ్గిన విజిల్.. వసూళ్లు మాత్రం జిగేల్..!

Bigil vijay film on women empowerment deletes few scenes

Bigil, diwali, Hero Vijay, Krishnagiri, Bigil, Bigil box office, Bigil box office collection, Bigil collection, Bigil box office collection Day 6, Bigil box office report, Vijay, Nayanthara, Atlee, Bigil Vijay, Tamil Nadu, Kollywood, movies, Entertainment

Thalapathy Vijay latest outing is on rampage, which crosses Rs 200 crore mark on its 6th day, The film which is said to be a movie on women Empowerment had deleted few scenes and shortened the run-time of the film.

నిడివి తగ్గిన విజిల్.. వసూళ్లు మాత్రం జిగేల్..!

Posted: 10/31/2019 09:09 PM IST
Bigil vijay film on women empowerment deletes few scenes

కాలీవుడ్ హీరో విజయ్ నటించిన బిగిల్ చిత్రం విడుదల ఒక సంచలనంగా మారింది. చిత్రానికి సంబంధించి స్పెషల్ షోలు వేయలేదని ఆయన అభిమానులు హద్దులు దాటి మరీ తమిళనాడులో బీభత్సం సృష్టించారు. వారిలో కొందరినీ సిసి కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘బిగిల్‌’. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. తెలుగులో విజిల్  (తమిళంలో ‘బిగిల్‌’) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక మరోవైపు ఈ చిత్రం విడుదైలన తరువాత కలెక్షన్లు వసూళ్లు కూడా మరో సంచలనానికి తెరలేపాయి. విడుదలైన ఆరు రోజుల వ్యవధిలోనే 200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది ఈ చిత్రం. ఈ చిత్రంలో హీరో విజయ్ కి వున్న ఫాన్ ఫాలోయింగ్.. ఆయన నటించేందుకు అంగీకరించే చిత్ర కథ ఎంపికకు మరోమారు దర్ఫణం పట్టింది. అయితే ఈ చిత్రం నిడివి తాజాగా తగ్గింది. చిత్ర నిడివిని తగ్గించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది చిత్ర యూనిట్.

చిత్రంలో ఓ అమ్మాయి ఆకారాన్ని హేళన చేస్తూ కథానాయకుడు విజయ్ మాట్లాడిన మాటల సన్నివేశాన్ని తొలగించారు. విజయ్ అలా మాట్లాడడం కథానాయకుడి వ్యూహం. అలా రెచ్చగొడితే వారిలో పట్టుదల పెరుగుతుందని, తద్వారా విజయం సాధించవచ్చనేది హీరో ఆలోచన. అయితే, అమ్మాయి ఆకారంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. దీంతో ఈ కారణంగా సినిమాపై వ్యతిరేక ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఆ సీన్‌ను తొలగించారు. దీంతో పాటు మరికొన్ని సీన్లను కూడా కట్‌చేసి బాగా ఎక్కువగా ఉన్న సినిమా నిడివిని తగ్గించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bigil  rs 200 crore  box office collections  Atlee  nayanthara  kollywood  

Other Articles