Namrata Meets Bharathi at Tadepalli వైఎస్ భారతితో నమ్రతా శిరోద్కర్ భేటీ..

Namrata shirodkar met ap cm wife ys bharathi

YS Bharathi meets Namrata shirodkar, Namrata Mahesh babu meets YS Bharathi Jagan, YS Bharathi, YS Jagan Mohan Reddy, Mahesh Babu, Namrata, Krishna, Burripalem, Andhra Pradesh, Tollywood

Telugu superstar Mahesh Babu and his wife and actor Namrata are known for their social welfare works. Babu has adopted some villages and the couple keeps implementing new ideas for their development.

వైఎస్ భారతితో నమ్రతా శిరోద్కర్ భేటీ..

Posted: 10/25/2019 07:03 PM IST
Namrata shirodkar met ap cm wife ys bharathi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీపరిశ్రమకు చెందిన పెద్దలు ఎవరూ భేటీ కావడంలేదని, ఆయనను అసలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వెళ్లి భేటీ అయ్యారు. తాను నటించిన తొలి చారిత్రక చిత్రం సైరాను చూడాల్సిందిగా కొరారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా వెళ్లి ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి రెడ్డిని కలిశారు.

తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన నమ్రత.. భారతితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమె భారతి దృష్టికి పలు విషయాలను తీసుకువచ్చారు. తన మామ, మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన బుర్రిపాలెంలో అభివృద్ది పనులపై వారు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ గ్రామాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. అప్పట్నించి ఈ గ్రామ అభివృద్ది పనులను తనవంతుగా కూడా చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తరపున చేస్తున్న అభివృద్ది పనులపై కూడా చర్చించారు.

ఈ సందర్భంగా మహేష్‌బాబు చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాలను వైఎస్ భారతి తెలుసుకుని ప్రశంసించారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, మహేష్ బాబులు సౌజన్యంతో బుర్రిపాలెంలో చేపట్టబోయే పనుల గురించి నమత్ర, భారతి చర్చించినట్లు సమాచారం. అలాగే గ్రామంలో తాము చేస్తున్న పనుల గురించి నమ్రత ప్రస్తావించినట్లు సమాచారం. మరోవైపు వైఎస్ భారతిని కలిసే ముందు నమత్ర విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Bharathi  YS Jagan Mohan Reddy  Mahesh Babu  Namrata  Krishna  Burripalem  Andhra Pradesh  Tollywood  

Other Articles