మన తెలుగు చిత్రసీమ కళామాతల్లి ప్రతి ఒకరికి జీవితాన్ని ఇస్తుంది .. నేటి యుగంలో సినిమా హీరో,హీరోయిన్లా కంటే నేపధ్య గాయకులకే హావ బాగా పెరిగింది.. వారికోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రోత్సాహ కేంద్రాలు, మనముందు దర్శనం ఇస్తున్నాయి.. మరీ ఒకానొక సందర్భంలో ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే గాయని గాయకుల సంఖ్య చాలా చిన్నది.. ఒక సినిమాలోని అన్ని పాటలు వారి చేతనే పాడించేవారు..కానీ నేడు పాట కొక గాయకుడూ,గాయని ప్రత్యేక్షమౌతున్నారు .అటువంటి కాలంలో తనదైన శైలిలో పాటలకు ప్రాణం పోసి నిలబడిన గాయకుడూ మనకు ఎంతగానో సుపరిచితుడైన బాల సుబ్రహ్మణ్యం గారు.. ఈయన గొంతుకలో ఏదో తెలియని మాధుర్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది.. చెవులను ఆహ్లాదపరుస్తుంది.. దాదాపు ఆ కాలం నాటి ఎవరిని అడిగినా, ఎవరి నోటా ఐన ఆయన పేరు వినపడాల్సిందే.. అంతగా ప్రేక్షగా ఆదరణ పొందారు ... ఈ మధ్య కాలంలో ఆయన పాటలకు మనం కరువయ్యాము ఎక్కడో ఒక అర కోర పాటలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇప్పుడు ఒక్కసారిగా అయన తన పాటతో మన హృదయాలను కొల్లగొట్టడానికి రానున్నారు. నువ్వు నాతో ఏమన్నవో నేనేం విన్నానో అనే రొమాంటిక్ మెలోడీ పాటతో మనల్ని అలరించడానికి వస్తున్నారు.. ఈ పాటను యు ట్యూబ్ లో విడుదల చేస్తే 2 మిలియన్ల మంది చూసారు.. అంతగా అలరిస్తుంది మరీ .. ఈ పాట రవితేజ నటిస్తున్నా డిస్కో రాజా సినిమాలోది.. తమన్ గారు కంపోస్ చేసారు.. ఇక బాల సుబ్రహ్మణ్యం అభిమానులకు ఇదో తీయనైన అరుదైన కనుకనే అని చెప్పాలి..
-శ్రీవల్లి..
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more