మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ చిత్రంలో ప్రదర్శించారని సినీ వర్గాల టాక్. అయితే టాక్ విషయాన్ని పక్కనబెడితే ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఎంత వసూళ్లు రాబట్టిందన్న విషయమై ఎక్కువగా ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.
చిరంజీవి 151వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం నాలుగు రోజుల వసూళ్లతో ఏకంగా రూ.123 కోట్లను అర్జించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా నాలుగురోజుల్లో 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇవి రికార్డుస్థాయి వసూళ్లేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ప్రపంచవ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి బాక్సాఫీసులను షేక్ చేసింది. భారతీయ చిత్రాలలో అత్యధిక తొలిరోజు కలెక్షన్లను రాబట్టిన ఐదవ చిత్రంగా కూడా రికార్డును క్రియేట్ చేసింది. ఇక భారతదేశ వ్యాప్త వసూళ్లను చూస్తూ.. తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం కర్ణటాకలో రూ.0.54 కోట్లు, తమిళనాడులో రూ.0.95కోట్లు, మలయాళంలో 0.31లతో పాటు మొత్తంగా 107 కోట్ల రూపాయలను వసూళు చేసింది. అయితే రెస్ట్ ఇండియాతో పాటు ఓవర్సీస్ లో రాబట్టిన వసూళ్లు కలిపితే ఇంకా అధికంగానే కలెక్షన్లు వుంటాయని అంచనా.
చిరంజీవి కెరియర్లో ఇది తొలి చారిత్రక చిత్రం కావడం.. దర్శకుడిగా తనకి వచ్చిన అవకాశాన్ని సురేందర్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకోవడం .. భారీ తారాగణం ఈ కథలో భాగస్వాములు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అన్ని రకాల ప్రత్యేకతల కలగలసి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని దీంతో వసూళ్లలోనూ దూసుకుపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.
(And get your daily news straight to your inbox)
Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more
Dec 09 | అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ... Read more
Dec 09 | సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని... Read more
Dec 09 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం అలా రోటీన్ గా కాకుండా అటు సూపర్... Read more
Dec 09 | ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా వెండితెరపై మెరిసిన త్రిష తాజాగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఎం.శరవణ్... Read more