Sye Raa Narasimha Reddy Battlefield trailer out చంపడమో, చావడమో కాదు గెలవడం ముఖ్యం: సైరా ట్రైలర్..

Sye raa battlefield trailer twitterati give thumbs up to the high octane action

Sye Raa Narasimha Reddy, Sye Raa Trailer 2, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Chiru, Sye Raa theatrical rights prices, Ram charan, Sye Raa satellite rights prices, Sye Raa digital rights prices, Sye Raa audio rights prices, Sye Raa area wise rights, Sye Raa distribution rights prices, Tollywood, Entertainment, Movies

Chiranjeevi’s upcoming historical-drama Sye Raa Narasimha Reddy has dropped a new battlefield trailer on Thursday and it certainly has a blockbuster written all over it.

గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు.. ‘సైరా’ రెండో ట్రైలర్

Posted: 09/26/2019 12:53 PM IST
Sye raa battlefield trailer twitterati give thumbs up to the high octane action

తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో నటిస్తున్న తొలి చారిత్రక చిత్రం.. 'సైరా నరసింహారెడ్డి' ట్రైయిలర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. చిరంజీవి యాక్షన్, అమితాబ్ బచ్చన్ గురుభోధ, రోమాలు నిక్కపోడుచుకునేలా పరుషంగా పలికిన డైలాగులు మెగా ఫాన్స్ ను అకట్టుకున్నాయి. ఈ ట్రైయిలర్ రాకతో సినిమా గురించి వేచిచూస్తున్న వారిని ఇక క్షణం కూడా ఆగలేమన్నట్లు చేస్తోంది.

తాజాగా ఈ రోజు ఈ చారిత్రక చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ విడుదల చేసిన రెండవ ట్రైలర్ ఆకట్టుకునే యుద్ధ సన్నివేశాలను చూపించారు. ఇది మనది.. మన ఆత్మగౌరవం.. గడ్డిపరక కూడా గడ్డ దాటకూడదు.. అంటూ చిరంజీవి నోటి నుంచి ఉద్వేగంగా వచ్చిన డైలాగ్స్.. ఆయనకు మార్గనిర్ధేశం చేస్తూన్న గురువు పాత్రంలో అమితాబ్ బచ్చన్ చంపడమో, చావడమో కాదు.. గెలుపు ముఖ్యం అంటూ చేస్తేన్న గురుబోధ సన్నివేశాలు అదరహో అనిపించాయి. చిరంజీవి నట విశ్వరూపం ప్రదర్శనకు ఈ చిత్రం నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం.. తెలుగుతో పాటు దక్షిణాధి బాషలైన తమిళ, మలయాళ, కన్నడంలో పాటు జాతీయ బాష హిందీలోనూ విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, తమన్నా కథానాయకులు. అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవి కిషన్ కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మాత.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa Trailer 2  Chiranjeevi  nayantara  amitabh bachchan  surender reddy  Ram Charan  Tollywood  

Other Articles