మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించిన కౌసల్య కృష్ణమూర్తి ట్రైయిలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య రాజేశ్ ఓ క్రికెటర్ గా అద్భుతంగా నటించిందని కితాబిచ్చారు. సినిమాలో క్రికెటర్ పాత్ర కోసం ఆమె నాలుగు నెలల పాటు క్రికెట్ నేర్చుకుని సెట్స్ మీదకు రావడం ఆమె అంకితభావానికి నిదర్శనం అని మెచ్చుకున్నారు. ఐశ్వర్య రాజేశ్ తమ కొలీగ్ రాజేశ్ కుమార్తేనని తెలిసి ఎంతో సంతోషం కలిగిందని, ఐశ్వర్య మేనత్త, కమెడియన్ శ్రీలక్ష్మి అందరికీ తెలిసిన వ్యక్తేనని, వారి వారసురాలుగా ఐశ్వర్య ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఇక సినిమా గురించి చెబుతూ, ఉత్తరాది రాష్ట్రాల్లో క్రీడల నేపథ్యంలో వచ్చే సినిమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారని, మనవద్ద కూడా ఆ స్థాయిలో ప్రోత్సాహం అవసరమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక ఐశ్వర్య రాజేశ్ తో చిరంజీవి వీడియో కాల్ లో మాట్లాడానని కూడా తెలిపారు. మీ నాన్న రాజేశ్, మీ మేనత్త శ్రీలక్ష్మి మాకు బాగా తెలుసమ్మా అంటూ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను అభినందించారు.
కాగా అంతకుముందే చిరంజీవి నుండి సర్‌ప్రైజింగ్ ఫోన్ కాల్ రావడంతో తాను ఉబ్బితబ్బిబవుతున్నానని హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ తెలిపారు. తను నటిస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి' (ది క్రికెటర్) టీజర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి ఆమెకు కాల్ చేసి, అభినందిచారని ఐశ్వర్య ట్వీట్ చేసింది. చిరు సర్ కాల్ చేసి, కౌసల్య కృష్ణమూర్తి టీజర్ చాలా బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.. చిరంజీవి గారితో మాట్లాడానంటే ఇంకా నమ్మలేకపోతున్నాను.. అంటూ తన హ్యాపీనెస్‌ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్‌ను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చెశారు. ఈ విషయాన్ని కూడా తెలిపిన నటి.. తన సంతోషానికి అవధులు లేవని చెప్పింది. తమిళ స్టార్ శివ కార్తికేయన్ కీలక పాత్రలో నటించిన సినిమా కణ.. ఐశ్వర్య రాజేష్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌లో చేసిన క్యారెక్టర్‌నే ఐశ్వర్య ఈ సినిమాలోనూ చేస్తుండగా, శివ కార్తికేయన్ అతిథి పాత్ర పోషించాడు.
ఓ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువతి అంతర్జాతీయ క్రికెటర్ కావాలనే లక్ష్యాన్ని ఎలా చేరుకుంది? అనేదే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ళ సెంటిమెంట్ హైలెట్ అవుతుందని, ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయిందని నిర్మాత తెలిపాడు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, ఝాన్సీ, సివిఎల్ నరసింహరావు, కార్తీక్ రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెమెరా: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, సంగీతం: ధిబు నైనన్ థామస్, కథ: అరుణ్ రాజా కామరాజ్, డైలాగ్స్: హనుమాన్ చౌదరి, ఆర్ట్: ఎస్ శివన్.
It was such a big surprise call from #MegaStarChiranjeevi garu ... he said he loved #KausalyaKrishnamurthy teaser .. am still awestruck d way chiru sir spoke to me .. thank u so much sir ... such a big honour to me @CCMediaEnt
— aishwarya rajessh (@aishu_dil) June 18, 2019
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more