ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ హీరో ఇమేజ్ ను ఎలివేట్ చేస్తుంటాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇక ఆటు మాస్ ప్రేక్షకులను తన మార్క్ దర్శకత్వంలో ఓలలాడించడం ఈ దర్శకుడి ప్రత్యేకత. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి సినిమా అనగానే అందర్లో భారీ అంచనాలు పెరిగిపోతుంటాయి. చిత్రంలోని హీరో పాత్ర ఎలా వుండబోతుందన్న అసక్తి సర్వత్రా నెలకొంటుంది. కథనాయకుడి పాత్రను చిత్రంగా చూపించడంలో పూరి దిట్ట. అందుకే పూరితో సినిమా చేయాలని చాలా మంది హీరోలు కోరుకుంటారు.
పూరి ‘ఇస్మార్ట్ శంకర్’లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. రామ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్ హూ.. శంకర్.. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ అని రామ్ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో మొదలైన టీజర్.. మాస్ అడియన్స్ కు హీరోను చాలా దగ్గరగా తీసుకువెళ్లే ప్రయత్నం జరిగిందన్న విషయం కొట్టోచ్చినట్టు కనబడుతుంది. రామ్ ను మాస్ గా చూపించే ప్రయత్నంలో టీజర్ మాత్రం ఊరమాస్ గా రూపోందించారు దర్శకుడు పూరి. అటు మాస్ డైలాగులతో పాటు ఇటు డ్యాన్స్, ఫైటింగ్ సన్నివేశాల్లో రామ్ చాలా స్టైలిష్‌గా కనిపించాడు.
‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ హిరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. రామ్, నభాలపై ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. మరో మూడు పాటల షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more