Koratala to kick begin with Megastar soon! తర్వలో పట్టాలెక్కనున్న చిరు-కొరటాల చిత్రం.!

Good news to mega fans koratala to kick begin with megastar soon

sye raa, chiranjeevi, Koratala Siva, Ram Charan, Surendrababu, amitabh bachchan, Vijay Sethupathi, Tamannaah Bhatia, freedom fighter, movies, entertainment, tollywood

Here is some good news for megastar chiranjeevi fans, the noted director Koratala Siva to kick begin the big venture with the Megastar in august.

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. తర్వలో పట్టాలెక్కనున్న చిరు-కొరటాల చిత్రం.!

Posted: 04/29/2019 10:33 PM IST
Good news to mega fans koratala to kick begin with megastar soon

తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితానికి సంబంధించిన అంశాలతో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవి బిజీగా వున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. కీలక సన్నివేశాలు ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై అప్పుడే మెగా ఫాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.

చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించనుండటం.. వీరికి తోడు నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి సహా భారీ తారాగణం నటిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం అందరి అంచనాలకు మించే విధంగా దర్శకుడు సురేంద్రబాబు రూపోందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడా రాజీ పడకుండా చిత్రషూటింగ్ వేగంగా సాగుతుంది.

ఈ తరుణంలో చిరంజీవి తదుపరి సినిమాపై కూడా అభిమానులు దృష్టి పెట్టారు. చిరంజీవి నెక్స్ట్ మూవీ కొరటాలతో వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన కొరటాల ఈ సినిమాను ఆగస్టులో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. పెద్ద గ్యాప్ లేకుండా రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారని అంటున్నారు. వినోదంతో పాటు సందేశంతో కూడిన కథగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. కథానాయికలుగా తమన్నా .. శ్రుతిహాసన్ పేర్లు వినిపిస్తున్నాయిగానీ, ఇంకా క్లారిటీ రాలేదు. సునీల్ .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారనే టాక్ మాత్రం వినిపిస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sye raa  chiranjeevi  Koratala Siva  Ram Charan  Surendrababu  tollywood  

Other Articles