Actor, mother held for rowdy's murder మేనబావ హత్యకేసులో నటికి అరదండాలు..

Actor mother held for rowdy s murder in bengaluru

sandalwood actress priyanka arrested under murder case, kannada actress jail for murder, ips section 300 actress arrested, kannada actress priyanka, movies, entertainment, tollywood

Sandalwood actress Priyanka, whose real name is Savitha, has acted in a couple of films such as, Yatna, IPC Section 300 and Hendathiyobbalu Maneholagidare is held for her involvement in a Rowdy sheeter Sunil murder case.

మేనబావ హత్యకేసులో నటి, అమె తల్లికి అరదండాలు..

Posted: 04/29/2019 09:41 PM IST
Actor mother held for rowdy s murder in bengaluru

తన మేనబావ హత్యకేసులో ఓ నటి అడ్డంగా బుక్కైంది. అమె ప్రమేయం వుందన్న పక్కా సమాచారంతో పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. అమెతో పాటు అమె తల్లిని కూడా అరెస్టు చేశారు. కన్నడ సినీ నటి ప్రియాంకతో పాటు ఆమె తల్లి నాగమ్మను చెన్నపట్టణ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియాంక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. పేరు మోసిన రౌడీ సునీల్ హత్య కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. జనవరి 29న ఓ ఇంట్లో సునీల్ పై మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.

ఈ హత్యలో ప్రియాంక, నాగమ్మల ప్రమేయం ఉందని నిర్ధారించిన పోలీసులు, వీరిని అరెస్ట్ చేశారు. ప్రియాంక అత్త కుమారుడే సునీల్. ప్రియాంక కారు డ్రైవర్ గా వ్యవహరిస్తుండేవాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సునీల్ ను డ్రైవర్ పని నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో, ఫోన్లు చేస్తూ డబ్బు కోసం తల్లీకూతుళ్లను వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేకే సునీల్ ను హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. కేసులో వీరి పేర్లు బయటకు రావడంతో, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రామనగర్ లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priyanka  murder case  kannada actress  sandalwood actress  tollywood  

Other Articles