Ram Charan receives love all the way from Japan! రాంచరణ్ కు స్వీట్ సర్ ప్రైజ్ చేసిన జపాన్ ఫ్యాన్స్..!

Ram charan thanked his japan fans for a sweet surprise

Ram Charan thrilled with Japan fans, Ram Charan, Ram Charan Japanese Fans, Tollywood Japan Fans, Japan fans, Ram Charan, Japanese Fans Greetings, Magadheera, Birthday, Japan, Charan, RRR, Rajamouli, movies, entertainment, tollywood

Mega Powerstar Ram Charan is enthralled by the love of Japan fans. Ram Charan and director Rajamouli's Magadheera is released and become a huge hit in Japan, The Japan fans showed their love by sending wonderful cards and gifts, which prepared by them with their own hands.

రాంచరణ్ కు స్వీట్ సర్ ప్రైజ్ చేసిన జపాన్ ఫ్యాన్స్..!

Posted: 04/23/2019 09:39 PM IST
Ram charan thanked his japan fans for a sweet surprise

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన మగధీర చిత్రం గుర్తుందా.. అయన చిత్ర కెరీర్ లో అదో మైలురాయి. ఇప్పుడా చిత్రం గురించి ఎందుకు చెబుతున్నారు.. ఓహో రాజమౌళి కాంబినేషన్ లో చెరణ్  నటించిన ఆర్ఆర్ఆర్ గురించి చెప్పబోతున్నారా.? అనుకుంటున్నారు కదూ.. కానీ అలా అని చెప్పి మీ మనసు నోప్పించలేము. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టే వేరప్పా. రాంచరణ్ జన్మదినం రోజు అనగా మార్చి 27ను పురస్కరించుకుని ఆయన నటించిన మగధీర చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్‌ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌’ అని రాసి పంపించారు. ఇలాంటివి ఏకంగా 50కి పైగా గ్రీటింగ్ కార్డులు చరణ్ కు అందాయి.

ఔనా.. ఇంతకీ వాటిని పంపింది ఎవరు.? అన్న డీటైల్స్ లోకి వెళ్లే ముందు ఈ నెల (ఏప్రిల్ ) 27 రాబోతున్న తరుణంలో ఇంత అలస్యంగా గ్రీటింగ్ కార్డ్స్ పంపించిందెవరు.? అంటారా.? అవి మనవాళ్లు పంపించినవి కాదు. ఏకంగా జపాన్ దేశం నుంచి వచ్చినవి. జజపాన్‌ అభిమానులు రాంచరణ్ ను ఈ గిప్టులతో సర్‌ప్రైజ్‌ చేశారు. ‘మగధీర’ చిత్రంలోని పాత్రల బొమ్మలను గ్రీటింగ్‌ కార్డులపై గీసి ‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌’ అని రాసి పంపించారు. వాటిని అందుకున్న చరణ్ ఈ గ్రీటింగ్‌ కార్డును ఫేస్ బుక్ లో పోస్ట్‌ చేశారు.

వీటితో పాటు ‘జపాన్‌ నుంచి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ను అందుకున్నాను. నా పట్ల మీకున్న ప్రేమానురాగాలు నన్నెంతో సంతోషపరిచాయి. నా జపాన్‌ అభిమానులకు ప్రేమను పంపుతున్నాను. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. థాంక్యూ జపాన్‌’ అని పేర్కొన్నారు. చరణ్‌ నటించిన ‘మగధీర’ చిత్రం జపాన్ లో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Japan fans  Ram Charan  Japanese Fans Greetings  Magadheera  Birthday  Japan  Charan  RRR  Rajamouli  Tollywood  

Other Articles