NTR Calls Jersey an Outstanding Film బంతి స్టేడియం దాటింది బ్రో... 'జెర్సీ'పై తారక్ స్పందన

Jr ntr is all praises for jersey s director gautam tinnanuri and nani

Gautam Tinnanuri, Jersey, jr ntr, Nani, Trending In South, Trending In South, Jr NTR, Jersey, Nani, Shraddha Srinath, Anirudh, movies, entertainment, tollywood

Jersey, movie has earned immense acclaim from all quarters, including from within the industry, critics and the audiences. Jersey seems to have found a huge fan in one of Tollywood's top contemporary stars - Jr NTR!

బంతి స్టేడియం దాటింది బ్రో... 'జెర్సీ'పై తారక్ స్పందన

Posted: 04/19/2019 07:32 PM IST
Jr ntr is all praises for jersey s director gautam tinnanuri and nani

నేచురల్ స్టార్ నాని వరుసగా రెండు ఫ్లాప్ సినిమాల తర్వాత జెర్సీ సినిమాతో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎమోషనల్ ఎలిమెంట్స్ తో మేళవించి ఈ సినిమాని మరో సారి తన మొదటి సినిమా తరహాలోనే మెప్పించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అనవసరమైన విషయాల జోలికి పోకుండా క్లీన్ నేరేషన్ తో కథనం నడిపించి, భార్య భర్తల ఎమోషన్ తో పాటు, తండ్రి, కొడుకుల ఎమోషన్ ని తెరపై అద్బుతంగా ఆవిష్కరించారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అర్జున్ పాత్ర కోసం నాని ఎంతగా కష్టపడ్డాడో అనేది తెరపై కనిపిస్తుంది అని చెప్పాలి.

రెగ్యులర్ ఆడియన్స్ ని మెప్పిస్తున్న ఈ సినిమాకి సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే జీర్సీ సినిమా చూసిన తారక్ ట్విట్టర్ లో సినిమా గురించి ఆసక్తికరమైన వాఖ్యలు చేసారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ‘‘జెర్సీ ఒక అద్భుతమైన చిత్రం. నన్ను పూర్తిగా మాయలో పడేసింది. గౌతమ్. అలాంటి సబ్జెక్టును ఎంచుకున్నందుకు. దాన్ని కన్విక్షన్ తోనూ నైపుణ్యంతోనూ తెరకెక్కించినందుకు హ్యాట్స్ ఆఫ్.గౌతమ్ విజన్ ను సపోర్ట్ చేస్తూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినందుకు క్యాస్ట్ & క్రూ కు అభినందనలు. బ్రదర్ నాని. నీ అద్భుతమైన నటనతో బాల్ ను స్టేడియం ఆవతలకి కొట్టావు’’ అన్న కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Tinnanuri  Jersey  jr ntr  Nani  Nani  Shraddha Srinath  tollywood  

Other Articles