ఓ ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంబోత్సవానికి ఓ నటి వస్తుందంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమ్మిగూడి అమెను తిలకించేందుకు గంటల పాటు నిరీక్షిస్తారు. ఇక హీరోలు వస్తున్నారంటే ఆ హడావిడి ఎలా వుంటుందో మనకు అంచనా వేయలేం. ఎందుకంటే మన సమాజంలో హీరోలకు, వారి హీరోయిజానికి అగ్రతాంబులం వుంది. అయితే ఎంత సేపు అభిమానులు హీరోలను వెసుకేసుకువచ్చి వారిని అకాశంలో కూర్చోబట్టడమేనా.. అభిమానుల కోసం హీరోలు తమ స్టార్ స్టేటస్ విడిచి ఒక్కసారైనా వస్తారా.? అన్న ప్రశ్నలు కూడా వినబడుతుంటాయి.
అయితే ప్రస్తుతం దక్షిణాధి రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా టాలీవుడ్, కాలీవుడ్ ఇండస్ట్రీలలో మాత్రం హీరోలకు స్టార్ స్టేటస్ ఎంత వున్నా అభిమానుల కోసం వారు గుప్తంగా ఎన్నో చేస్తుంటారు. తమ అభిమానుల కోసం అసుపత్రులకు వెళ్లి వారిని కలసి వారిలో మనోధైర్యాని నింపి.. అంపశయ్యలాంటి అసుపత్రి బెడ్ పై నుంచి వారిని స్వేఛ్చావాయువులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పని ఆయనను మరింత పీక్స్ కు తీసుకెళ్లింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తన 19వ సినిమా ఇవాళ ప్రారంభమైంది. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే, ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న అల్లు అర్జున్ దారిపక్కన ఇద్దరు వ్యక్తులు తనకోసం చేయి ఊపడాన్ని గమనించారు. వాళ్లు అందరిలాకాకుండా జన్మతః లోపంతో ఉన్నట్టు గుర్తించి వెంటనే కారు ఆపారు. వెళ్లి వాళ్లిద్దరని ఎంతో ఆత్మీయంగా పలకరించి వాళ్లలో ఆనందం నింపారు. అంతేకాదు, బన్నీ వాళ్లిద్దరితో ఫొటోలు దిగి మరింత సంతోషంలో ముంచెత్తారు. హీరో అంటే ఇతనేరా అనేట్లు చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more