Harish Shankar Launches Varun Tej as ‘Valmiki’ వరుణ్ తేజ్ తో హరీశ్ శంకర్ ‘వాల్మీకి’ లాంచ్..!

Varun tej and harish shankar s valmiki movie launch

Director Harish Shankar, Varun Tej, Valmiki, Atharvaa Murali, Ram Achanta, Gopi Achanta, Jigarthanda, movie launched, Siddharth, Bobby simha, movies, entertainment, kollywood, tollywood

Director Harish Shankar as announced a few days back, he launched his movie today with Varun Tej as the lead. Even he titled the film as Valmiki. It is being produced by Ram Achanta and Gopi Achanta, a remake of 2014 Tamil film Jigarthanda.

వరుణ్ తేజ్ తో హరీశ్ శంకర్ ‘వాల్మీకి’ లాంచ్..!

Posted: 02/21/2019 03:34 PM IST
Varun tej and harish shankar s valmiki movie launch

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడు హరీశ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఇవాళే పట్టాలెక్కేసింది. ఇవాళ లాంఛనంగా షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రంలో రెండో హీరోగా అథ్వర్వ మురళినీ తీసుకునే అవకాశాలు వున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'దువ్వాడ జగన్నాథం' సినిమా తరువాత జోరు తగ్గించుకున్న హరీశ్ శంకర్ అప్పటికే ప్లాన్ చేసుకున్న రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. దాంతో ఆయనకి ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ఓ రిమేక్ ను రూపోందించే పనిలో పడ్డాడు. తమిళంలో కొంతకాలం క్రితం ఘన విజయాన్ని అందుకున్న 'జిగర్తాండ' సినిమాను రీమేక్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు.

ఈ రీమేక్ కి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఆయన ఇవాళే లాంఛనంగా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ ఏడాది చివరిలో దసరాకు లేదా క్రిస్ట్ మస్ పండగ సెలవులలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో వున్నారు. ఇది తన కెరియర్లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harish Shankar  Varun Tej  Valmiki  Atharvaa Murali  Ram Achanta  Gopi Achanta  Jigarthanda  tollywood  

Other Articles

Today on Telugu Wishesh