అఖిల్ తొలి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించలేదు. దాంతో అభిమానులంతా ఆయన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అఖిల్ కూడా ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అందువల్లనే కథల ఎంపికలో మరింత జాగ్రత్త వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఫలానా దర్శకుడితో ఆయన తదుపరి సినిమా వుండనుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టమైంది.
తాజాగా ఇప్పుడు 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. 'గీత గోవిందం' చూసిన తరువాత, ఆ కథను పరశురామ్ హ్యాండిల్ చేసిన తీరు నాగార్జునకి బాగా నచ్చిందట. దాంతో ఆయనతో అఖిల్ సినిమా వుంటే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ రానుంది.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more