RRR team back to work ఆర్ఆర్ఆర్ సెకెండ్ షెడ్యూల్డులో ఆర్ త్రయం బిజీ

Rrr second schedule rajamouli ram charan jr ntr starts work

RRR, RamaRavanaRajyam, Ram Charan, NTR, Tarak, Junior NTR, Rajamouli, Senthil Kumar, second shedule, Baahubali director, movies, entertainment, tollywood

The second schedule of the biggest multi-starrer 'RRR' has resumed on Monday. Being made with a budget of Rs 200 crore, the film is using new technology in its making.

ఆర్ఆర్ఆర్ సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్.. అర్రీ లెన్సులతో..

Posted: 01/21/2019 07:02 PM IST
Rrr second schedule rajamouli ram charan jr ntr starts work

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్లో మొదలైన మొదటి షెడ్యూల్‌ ఇటీవల పూర్తైంది. కాగా ఈ చిత్రం ఇవాళ్టి నుంచి రెండో భారీ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాయి. ఈ చిత్రానికి రామరావణ రాజ్యం టైటిల్ ను కూడా ఖారారు చేసిననట్లు వార్తలు అందుతున్నాయి.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్ పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించారు. కథానాయికల వివరాలు, ఇతర తారాగణానికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించలేదు. రాజమౌళి ప్రాజక్టు అనగానే తెలుగు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొనడం తెలిసిందే.

ఇందులో బాలీవుడ్‌ భామ అదితి రావు హైదరిని ఓ కథానాయికగా ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. సినిమా చిత్రీకరణను త్వరగా పూర్తిచేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ఈ చిత్రం కోసం చరణ్‌, తారక్ లను రాజమౌళి పది నెలలు సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఇందుకు వారు కూడా ఒప్పుకొన్నారని, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పూర్తయ్యేవరకు మరో సినిమా చిత్రీకరణను మొదలుపెట్టరని టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Ram Charan  NTR  Tarak  Junior NTR  Rajamouli  Senthil Kumar  second shedule  tollywood  

Other Articles