Director's Confidence Raising Hype on Mega Film ప్రేక్షకులకు ‘అంతరిక్షం’లోకి వెళ్లిన అనుభూతి: సంకల్ప్ రెడ్డి

Director s confidence raising hype on anthariksham

sankalp reddy, antariksham 9000 kmph, Varun tej, Ghazi, aditi rao hydari, Tollywood's First Space Film, Rajeev Reddy, Gnana Sekhar VS, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Director Sankalp Reddy is coming with another different movie ‘Anthariksham’ starring Varun Tej, and Aditi Rao Hydari playing the lead pair as astronauts, the curiosity on the film will create buzz on the movie.

ప్రేక్షకులకు ‘అంతరిక్షం’లోకి వెళ్లిన అనుభూతి: సంకల్ప్ రెడ్డి

Posted: 11/09/2018 06:34 PM IST
Director s confidence raising hype on anthariksham

సముద్రగర్భంలో సినిమాను రూపోందించడం అతికష్టం. కానీ అలాంటి కథను ఎంచుకుని 'జలాంతర్గామి' నేపథ్యంలో రూపోందిన 'ఘాజీ' చిత్రంతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి.. తాజాగా తెరకెక్కిస్తున్న మరో అద్భుత చిత్రం అంతరిక్షం. తెలుగు సినీచరిత్రంలో తొలిసారిగా ఖగోళానికి సంబంధించిన చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి 'అంతరిక్షం' అని నామకరణం కూడా చేసేసింది చిత్ర యూనిట్.

ఇప్పటికే షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున శర్వానంద్, సాయిపల్లవి నటించిన పడిపడి లేచె వయస్సు చిత్రం కూడా విడుదల కానుంది. అయితే ఈ రెండు చిత్రాలకు మధ్య పోటీ నెలకొన్న క్రమంలో ఎవరి చిత్రం ఎలా ఉండబోతుందా.? అన్న ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. అయితే తన తొలిచిత్రం ఫిదాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయిపల్లవికి.. ఆ చిత్రం హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు మధ్య పోటీ నెలకొనడం కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో అంతరిక్షం సినిమాపై దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమాలో అంతరిక్షానికి సంబంధించిన విజివల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తాయి. తామే అంతరిక్షంలో ఉన్నంతగా ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఉత్కంఠను రేకెత్తించేవిగా ఉంటాయి. బలమైన కథాకథనాలు పట్టుగా నడుస్తూ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో చెప్పుకోదగినది అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sankalp reddy  antariksham 9000 kmph  Varun tej  Ghazi  aditi rao hydari  tollywood  

Other Articles