Vijay film eyes Rs 100 crore clubసర్కార్: రెండు రోజుల్లో రూ.110 కోట్ల గ్రాస్..

Sarkar box office collection day 2 vijay film eyes rs 100 crore club

Sarkar, Vijay, Sarkar collections, Sarkar protest, Sarkar protest news, Sarkar box office collection, Sarkar 100 crore, Sarkar movie, Sarkar movie news, Sarkar movie controversy, Sarkar AIADMK controverst, Sarkar updates, tollywood, movies, entertainment

sarkar boxoffice collection day 2: According to trade, Vijay’s film directed by AR Murugadoss has collected Rs 100 crore in two days.

రెండు వందల కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న సర్కార్..

Posted: 11/08/2018 07:07 PM IST
Sarkar box office collection day 2 vijay film eyes rs 100 crore club

విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన 'సర్కార్' మూవీ, దీపావళి కానుకగా తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, వసూళ్లపరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఓటర్లు కష్టపడి పోలింగ్ బూత్ కు వెళ్లి.. అక్కడ తమ ఓటును ఎవరో వేసి వెళ్తే ఊసురుమంటూ వెనక్కు తిరిగి వచ్చిన వారి సంఖ్య అనేకం.

పలువురికి ఇలాంటి సంఘటనలు ప్రతీ ఎన్నికలోనూ ఎదురవుతుంటాయి. ఇలా జరిగితే తమ ఓటును అసలైన ఓటరు ఎలా వేయవచ్చో ఓటర్లు అవగాహన కల్పించిన చిత్రం సర్కార్. తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 56.90 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగించింది. రెండు రోజులను కలుపుకుని ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా విడుదులైన తరువాత.. దీనిని చూసిన ప్రేక్షకులు ఒక్ అంశం కోసం తెగ వెతికేస్తున్నారు.

అదే సెక్షన్ 49-పి, ఇదే సెక్షన్ కింద అసలైన ఓటరు తమ ఓట హక్కును రాబట్టుకునే అవకాశం వుంది. దీంతో అభిమానులతో పాటు అనేక మంది నెట్టింట్లో ఈ సెక్షన్ గురించి తెగ వెతికేస్తున్నారు. ఇక విజయ్ సర్కార్ చిత్రం.. రజనీకాంత్ 'కాలా' సినిమా వసూళ్లను కూడా అధిగమించింది. 200 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. మొత్తానికి మురుగదాస్.. విజయ్ ఒకదానికి మించి ఒకటి హిట్ కొట్టేశారని అంతా చెప్పుకుంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarkar  Vijay  box office collections  Rs. 100 crore  Rajni Kanth kaala  tollywood  

Other Articles