Venkatesh, Varun Tej to work as Coolies రావిపూడి చిత్రంలో కూలీలుగా వెంకీ, వరుణ్

Venkatesh varun tej to work as coolies

anil ravipudi, venkatesh, varun tej, coolie, railway porters, dil raju, Tamanna Bhatia, mehreen pirzada, movies, entertainment, tollywood

Venkatesh Daggubati and Varun Tej are working together for an upcoming movie F2 (Fun & Frustration), which is progressing at brisk pace in the direction of Raja the Great fame Anil Ravipudi.

రావిపూడి చిత్రంలో కూలీలుగా వెంకీ, వరుణ్

Posted: 11/03/2018 03:44 PM IST
Venkatesh varun tej to work as coolies

విక్టరీ వెంకటేష్, మోగా హీరో వరుణ్ తేజ్‌ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) ఆసక్తికరమైన అప్ డేట్ అందుబాటులోకి వచ్చింది. ఈ అప్ డేట్ తో అటు విక్టరీ వెంకీ అభిమానులతో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కూడా సంబరపడుతున్నారు. వీరిద్దరూ కలసి నటిస్తున్న తొలి చిత్రం తప్పకుండా మంచి హిట్ సాధిస్తుందని అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. అందుకు కారణం ఆ చిత్ర దర్శకులు అందించిన అప్ డేట్.

‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ వంటి వినోదాత్మక సినిమాలతో హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన ఫొటోను అనిల్ ట్వీట్ చేశారు. ఇందులో రైల్వే కూలీ షర్ట్‌ల్లో.. కూలీ నెం.1, కూలీ నెం.786 బ్యాడ్జీలతో ఉన్న వెంకటేష్‌, వరుణ్ తేజ్ల చేతులను ఆయన పోస్ట్ చేశారు.

దీంతో వెంకీ, మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కూలీ నెంబరు.1లో వెంకీ పంచిన మాస్ మాసాలా ఎంటర్‌టైన్మెంట్‌.. ఈ చిత్రంలోనూ ఉంటుందని తెలుస్తోంది. బ్యాడ్జ్‌లో కనిపించిన నెంబర్లు ప్రకారం.. కూలీ నెం.1 బ్యాడ్జ్ ఉన్న చేయి వెంకటేష్‌ది, కూలీ నెం.786 వరుణ్ తేజ్‌గా తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌ సరసన మెహరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anil ravipudi  venkatesh  varun tej  coolie  railway porters  dil raju  tollywood  

Other Articles