Another Biopic Coming in Two Parts రెండు భాగాలుగా పుల్లెల గోపిచంద్ బయోపిక్..

Pullela gopichand biopic split in two parts

pullela gopichand, sudheer babu, Parveen Sattaru, Biopic, gopichand biopic, badminton player, badminton national coach, saina nehwal, pv sindhu, kidambi srikanth, prannaoy roy, Badminton, sports

Right from the beginning of the project on the Pullela Gopichand film, director Parveen Sattaru and actor Sudheer Babu have been considering making the film in two parts.

పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా రెండు భాగాలుగా.?

Posted: 10/27/2018 12:29 PM IST
Pullela gopichand biopic split in two parts

తెలుగు తెరపై ప్రస్తుతం బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఓ వైపు తొలితర స్వతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి జీవితాన్ని అధారంగా చేసుకుని మెగాస్టార్ చిరంజీవి ఓ చిత్రంలో నటిస్తుండగా, అంధ్రులు అన్న స్వర్గీయ ఎన్టీఆర్ జీవితాన్ని బాలకృష్ణ కథనాయకుడు, మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇదివరకే తెలుగు ప్రేక్షకుల అధారాభిమానాలు పోందిన నటి సావిత్రి జీవిత ఆధరాంగా ఓ చిత్రం విడుదలైంది.

'మహానటి' టైటిల్ తో వచ్చిన నటి సావిత్రి బయోపిక్ కూడా ప్రేక్షకులు నిరాజనాలు అందుకుంది. ఈ చిత్రానికి భారీస్థాయిలో రెస్పాన్స్ రావడంతో, చకచకా మరికొన్ని బయోపిక్ లకి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుధీర్ బాబు తాను నిర్మాతగా .. హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి దర్శకుడిగా ఆయన ప్రవీణ్ సత్తారును ఎంచుకున్నాడు.

ఈ సినిమా స్క్రిప్ట్ పైనే ప్రవీణ్ సత్తారు పనిచేస్తున్నాడు. 'గరుడ వేగ' తరువాత ఆయన చేస్తోన్న సినిమా ఇదే. పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను రెండు భాగాలుగా అందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. గోపీచంద్ బాల్యం .. విద్యాభ్యాసం .. బ్యాడ్మింటన్ దిశగా అడుగులు మొదటిభాగంలో చూపిస్తారట. రెండవభాగంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సాధించిన విజయాలు .. అనుభవాలను గురించి చూపిస్తారట. అయితే ఈ బయోపిక్ ఒక భాగంగా వస్తేనే బాగుంటుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pullela gopichand  sudheer babu  Parveen Sattaru  Biopic  Badminton  

Other Articles