tollywood senior producer no more నిర్మాత శివప్రసద్ రెడ్డికి ప్రముఖుల సంతాపం

Tollywood senior producer siva prasad reddy passes away

Siva Prasad Reddy, Kamakshi Movies, Tollywood, Nagarjuna, Allari Alludu, Auto Driver, Seetharama Raju, Eduruleni Manishi, Nenunnanu, Boss, King, Kedi, Ragadaచ Greeku Veerudu, chiranjeevi, mutha mestri, celebrities, tollywood

Noted producer and founder of well-know production house Kamakshi Movies, Siva Prasad Reddy, has breathed his last. Siva Prasad Reddy was 62. He died at Apollo Hospital in Chennai today.

మరో విషాదం.. సీనియర్ నిర్మాత‌ కన్నుమూత

Posted: 10/27/2018 11:39 AM IST
Tollywood senior producer siva prasad reddy passes away

టాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత డి శివప్రసాదరెడ్డి ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. గత కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది. సర్జరీ తరువాత గత రాత్రి ఆయన ఆరోగ్యం మరోమారు విషమించింది. అయితే చికిత్స జరుగుతుండగానే ఆయన మరణించినట్టు తెలుస్తోంది.

1985లో కామాక్షీ మూవీస్ బ్యానర్ ను స్థాపించిన ఆయన అగ్రహీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కార్తీకపౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీదాదా, ముఠామేస్త్రీ, అల్లరి అల్లుడు, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ఎదురులేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడీ, రగడ, దడ, గ్రీకువీరుడు తదితర చిత్రాలను నిర్మించారు. శివప్రసాదరెడ్డి మృతికి నాగార్జున సంతాపాన్ని వెలిబుచ్చారు. ఆయన మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని అన్నారు. తెలుగు, తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సంతాపాన్ని వెలిబుచ్చారు.

శివప్రసాదరెడ్డి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియ‌జేశారు. శివ‌ప్ర‌సాద్ మ‌ర‌ణ వార్త తెలియ‌గానే షాక్ అయిన నేను ఆయ‌న కుమారుడు చంద‌న్ తో ఫోన్‌లో మాట్లాడి ప‌రామ‌ర్శించాను. ఆయ‌న నాకు సాత్వికుడు, మంచి మిత్రుడు. వారి కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని చిరంజీవి అన్నారు. శివ‌ప్ర‌సాద్ నిర్మాణంలో చిరు హీరోగా తెర‌కెక్కిన ముఠా మేస్త్రి చిత్రం టాలీవుడ్ లో పెద్ద హిట్ అయింది. మ‌రో వైపు శివ ప్ర‌సాద్ రెడ్డికి ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల కూడా సంతాపం తెలిపారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాడ సానుభూతి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siva Prasad Reddy  Kamakshi Movies  chiranjeevi  Nagarjuna  Tollywood  

Other Articles