Aravinda Sametha 14 Days Box Office Collections అరవింద సమేత రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరేనా.?

Jr ntr s film does well despite slowing down

Trivikram Srinivas, Aravinda sametha, Jr NTR, pooja hedge, rs 100 cr club, tollywood, movies, entertainment

Aravinda Sametha has slowed down at the box office but it's still the first choice of the target audience. Its 14-day worldwide share stands at around Rs 93 Crore.

అరవింద సమేత రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరేనా.?

Posted: 10/24/2018 07:54 PM IST
Jr ntr s film does well despite slowing down

దసరా పండగ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుల ముందకు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అరవింద సమేత వీర రాఘవ' ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం.. అదే సమయంలో సెలవులను ఎంజాయ్ చేస్తున్న పిల్లా, పెద్దలు చిత్రం బాగుందంటూ హిట్ టాక్ ను ఇవ్వడం.. ఫలితంగా జూనియర్ ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం.. ఎన్టీఆర్ కెరీర్ లోనే కనీవిని ఎరుగని వసూళ్లను రాబట్టుకుంటూ దూసుకుపోయింది.

ఈ సినిమా విడుదలైన 14 రోజుల్లో మంచి షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పదకోండు రోజుల్లో 69 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో 93 కోట్ల షేర్ మార్క్ ను దాటడం విశేషం. ఇన్ని రోజుల్లో ఇంతవేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే ఫస్టు టైమ్ అని అంటున్నారు. ఓవర్సీస్ వసూళ్ల విషయంలోను ఈ సినిమా రికార్డును సృష్టించింది. అయితే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా.? అన్న విషయమై తారక్ అభిమానులు అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

త్రివిక్రమ్ ఇమేజ్ .. ఎన్టీఆర్ క్రేజ్ .. కథాకథనాలు ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిత్రానికి పూర్తిగా ఎమెషన్స్ బలంగా నిలిచాయి. పూజా హెగ్డే గ్లామర్ .. తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని నమోదు చేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక నెమ్మదిగానైనా వందకోట్ల క్లబ్ లోకి ఈ చిత్రం చేరుతుందని అభిమానులు అశిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram Srinivas  Aravinda sametha  Jr NTR  tollywood  movies  entertainment  

Other Articles