Kerala musician Balabhaskar passed away సంగీత దర్శకుడి మృతితో విషాదంలో మాలీవుడ్

Week after car accident kerala musician balabhaskar dies

Balabhaskar, Balabhaskar no more, Balabhaskar passed away, Balabhaskar dies from injuries, Pallipuram, Kerala musician and violinist Balabhaskar, Kerala, Malayalam, Mollywood, tollywood, movies, entertainment

Kerala musician and violinist Balabhaskar, who was seriously injured along with his wife in a road accident last week, died here in the early hours of Tuesday, informed sources said.

సంగీత దర్శకుడి మృతితో విషాదంలో మాలీవుడ్

Posted: 10/02/2018 05:58 PM IST
Week after car accident kerala musician balabhaskar dies

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రముఖ సింగర్, వయోలినిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్ బాలభాస్కర్ (40) మంగళవారం కన్నుమూశారు. కుటుంబంతో సహా సెప్టెంబరు 25 న దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తూ తిరువనంతపురం శివార్లలో జరిగిన ప్రమాదంలో గాయకుడు బాలభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో ఆయన రెండేళ్ల కుమార్తె తేజస్వి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఆయన, వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

ఆయన కోలుకోవాలని గత వారం రోజులుగా అభిమానులు, కుటుంబసభ్యులు చేసిన ప్రార్థనలు ఫలించకపోవడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత సోమవారం త్రిస్సూర్‌లోని ఓ ఆలయాన్ని దర్శించుకోడానికి భార్య లక్ష్మీ, కుమార్తె తేజస్వితో సహా బాలభాస్కర్ వెళ్లారు. దర్శనం పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగొస్తుండగా వారు ప్రయాణిస్తు వాహనం అదుపుతప్పి, రహదారిపై ఉన్న ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో బాలభాస్కర్ కుమార్తె తేజస్వి (2) అక్కడికక్కడే మరణించగా, భాస్కర్, ఆయన భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్‌లకు తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వీరిని తిరువనంతపురంలోని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. బాలభాస్కర్ మెదడుకు గాయం కావడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెన్నుముక దెబ్బతినడంతో శస్త్రచికిత్స సైతం నిర్వహించారు. అయితే, మెదడులో రక్తస్రావం కావడంవల్లే ఆయన మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భార్య లక్ష్మీ, డ్రైవర్ అర్జున్‌లు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అభిమానుల సందర్శనార్ధం బాలభాస్కర్ భౌతికకాయాన్ని ఆయన విద్యాభ్యాసం చేసిన తిరువనంతపురం కాలేజీకి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Violinist Balabhaskar  singer  balabhaskar accident  singer balabhaskar  Mollywood  

Other Articles