Director Shankar's Exciting Future Plan భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు రెడీ అంటున్న శంకర్..

Shankar opens up on 2 0 rumor indian 2 and his next sci fi film

shankar, direcor, 2.0, indian 2, science fiction movie, rajnikanth, kamal hassan, shanker movies, director shankar movies, shankar movie collections, tollywood, kollywood, movies, entertainment

The immediate next from Director Shankar would be Indian 2 which will go on sets from December once 2.0 hits the screens. The next one after that would be another sci-fi film the casting of which will be divulged later.

భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు రెడీ అంటున్న శంకర్..

Posted: 10/01/2018 03:20 PM IST
Shankar opens up on 2 0 rumor indian 2 and his next sci fi film

దర్శకుడు శంకర్ పేరు చెప్పగానే ఇటు దక్షిణ భారతంతో పాటు అటు భారతీయ చలనచిత్ర రంగం కూడా ఆయన రూపోందించిన చిత్రాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా.? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కి విపరీతమైన క్రేజ్ వుండమే ఇందుకు కారణం. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యతను ఇచ్చినా, బలమైన కథాకథనాలు ఉండేలా చూసుకోవడం ఆయన ప్రత్యేకత. అలాంటి శంకర్ గత కొంతకాలంగా రజనీకాంత్ నటించిన '2.ఓ' చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో నిమగ్నమై మూడేళ్లుగా సినిమాలు విడుదల చేయకుండా వుండిపోయాడు.

అంతకుముందు ఆయన దర్శకత్వంలోనే రూపోందించిన ఐ చిత్రం విషయానికొస్తే అదో మూడేళ్లు తీసుకున్నా చిత్రానికి మాత్రం ఆశఇంచిన స్థాయిలో ప్రేక్షకాదరణ లభించలేదు. దీంతో ఈ ఏడాది చివరాంకంలో తన 2.0 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో వున్న శంకర్.. ఆ తరువాత వెంటవెంటనే పలు చిత్రాలు చేయనున్నాడని వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగిపోతున్నాయన్న నేపథ్యంలో వీటిపై స్వయంగా శంకర్ స్పందించారు.

 ఈ సినిమా తరువాత తాను 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ చేస్తున్నానని, ఆ తరువాత మరో భారీ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ఇప్పటి నుంచే రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నానని చెప్పాడు. ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో .. ఉత్కంఠను రేకెత్తించే విధంగా ఉంటుందని అన్నాడు. ఈ ప్రాజెక్టు కూడా వందలకోట్ల బడ్జెట్ లోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో నాయకా నాయికలుగా ఎవరు నటించనున్నారనే విషయమే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shankar  direcor  2.0  indian 2  science fiction movie  kollywood  

Other Articles