క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలకృష్ణ .. రానా కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 18 (సోమవారం) నుంచి ఈ సినిమా షూటింగులో కల్యాణ్ రామ్ జాయిన్ కానున్నాడు.
ఈ సినిమాలో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ చేయనున్నాడనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్థానంలో హరికృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ పాత్ర కోసమే కల్యాణ్ రామ్ ను ఎంపిక చేసుకున్నారు. ఎల్లుండి నుంచి బాలకృష్ణ .. కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ 25 రోజుల కాల్షీట్స్ ఇచ్చాడట. ఎన్నో ప్రత్యేకతలు .. మరెన్నో విశేషాలు కలిగిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. జక్కనగా తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులు ముద్గుగా పిలుచుకునే దర్శకదిగ్గజం రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ... Read more
Jun 29 | లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘విక్రమ్’. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అర్జించింది. దాదాపు... Read more
Jun 29 | టాలీవుడ్ అగ్రనిర్మాతలలో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల... Read more
Jun 29 | టాలీవుడ్ బ్యాచిలర్స్రో ఒకరైన యంగ్ హీరో రామ్ పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన... Read more
Jun 29 | హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా... Read more