‘Taramani’ all set to release in Telugu త్వరలో తెలుగులో యదార్థ ప్రేమకావ్యం ‘తారమణి’

Tamil hit film taramani all set to release in telugu

Tamil Hit film, ‘Taramani’, Andrea Jeremiah, Anjali, Vasanth Ravi, Adrian Knight Jesly, director Ram, producer D Venkatesh. music MM Sreelekha, latest movie news, tollywood, kollywood, movies, entertainment

Tamil Hit film ‘Taramani’, starring Andrea Jeremiah, Anjali, Vasanth Ravi and Adrian Knight Jesly in lead roles, is yet to release in Telugu with the same name by producer D Venkatesh.

తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న తారామణి

Posted: 08/24/2018 06:21 PM IST
Tamil hit film taramani all set to release in telugu

దక్షిణాదిలో ఏ బాషలో చిత్రం సూపర్ హిట్ అయినా వెంటనే మిగతా బాషల్లోకి వెళ్లి అక్కడ కూడా తమ విజయదుంధుభిని మ్రోగిస్తుంటాయి. ఇప్పటికే ఇలా అనేక చిత్రాలు వచ్చి విజయాలను అందుకోగా, అదే ఒరవడిని కొనసాగిస్తూ టాలీవుడ్ లోకి అనువదించబడి వస్తుంది ఓ కాలీవుడ్ చిత్రం. తమిళనాడులో జరిగిన యధార్థగాధకు చిత్ర రూపమిచ్చి విజయాన్ని అందుకున్న చిత్రం తాజాగా తెలుగుప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

యదార్థంగా జరిగిన ప్రేమకథ అన్న అంచానాలతో.. ఇప్పటికే తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారన్న వార్తలతో మరింతగా అంచనాలను పెంచగా, ఇక ప్రేమకావ్యం అంటూ యావత్ యూత్ ను ఆకర్షిస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే భారీగా అంచనాలను పెంచేసుకుంది. దీంతో తెలుగు తెరపైకి తారమణి త్వరలోనే రాబోతుంది. తమిళంలో రామ్ దర్శకత్వంలో క్రితం ఏడాది 'తారామణి' సినిమా తెరకెక్కింది.

వసంత్ రవి .. అంజలి .. ఆండ్రియా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. చెన్నైలో జరిగిన ఒక యధార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అక్కడి యూత్ కి ఈ సినిమా ఒక రేంజ్ లో నచ్చడంతో కాసుల వర్షం కురిసింది. దాంతో అదే పేరుతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత డి. వెంకటేశ్ సన్నాహాలు చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ‘Taramani’  Andrea Jeremiah  Anjali  Vasanth Ravi  Adrian Knight Jesly  Ram  tollywood  kollywood  

Other Articles

Today on Telugu Wishesh