Sonali Bendre wishes son on his birthday రణ్ వీర్ బర్త్ డే.. సోనాలి భావోద్వేగ పోస్టు..

Sonali bendre wishes son ranveer on his birthday in an emotional post

sonali bendre, sonali bendre instagram, sonali bendre son, sonali bendre son birthday, sonali bendre latest photos, sonali bendre ranveer, ranveer behl, sonali bendre son name, sonali bendre news, sonali bendre cancer, sonali bendre latest, Tollywood, Bollywood, movies, entertainment

Sonali Bendre who is battling with cancer in New York posted a video with a series of photos with her 'not-so-little-one' Ranveer Behl on his 13th birthday.

రణ్ వీర్ బర్త్ డే.. సోనాలి భావోద్వేగ పోస్టు..

Posted: 08/11/2018 03:25 PM IST
Sonali bendre wishes son ranveer on his birthday in an emotional post

బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి సోనాలి బింద్రే.. కుమారుడు ఇవాళ ఆగస్టు 11న తన 13వ పుట్టిన రోజును జరుపుకొంటున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న సోనాలి ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉన్న కుమారుడ్ని కలవలేని ఆమె భావోద్వేగంతో సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు. తొలిసారి తన ముద్దుల కుమారుడి పుట్టినరోజున అతడి పక్కనలేనని అన్నారు. దీంతో పాటు ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.

‘రణ్‌వీర్‌.. నా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం.. నేను కాస్త ఎక్కువ భావోద్వేగానికి‌ గురవుతున్నానేమో. అయినా సరే.. నీ 13వ పుట్టినరోజుకు ఆ అర్హత ఉంది. వావ్‌.. ఇప్పుడు నువ్వు టీనేజర్ వి. ఆ నిజాన్ని నమ్మడానికి నాకు కాస్త సమయం పడుతుంది. నీ మానవత్వం, బలం, దయ పట్ల నేను ఎంత గర్వంగా ఉన్నానో చెప్పలేను. నా బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇది. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. నీకు నా అమితమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది..’ అని సోనాలి పోస్ట్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonali bendre  ranveer behl  instagram  son birthday  latest photos  cancer  Bollywood  Tollywood  

Other Articles