niharika's happy wedding gets U certificate హ్యాపీ వెడ్డింగ్ కు సెన్సార్ ‘యు’ సర్టిఫికేట్

Niharika s happy wedding gets u certificate

Happy Wedding First Invitation,Happy Wedding Teaser,Sumanth Ashwin,Niharika Konidela,#HappyWeddingTeaser,UV Creations,Happy Wedding,Happy Wedding Movie Teaser,Happy Wedding Telugu Movie Teaser,Happy Wedding Trailer,Happy Wedding Telugu Trailer,Lakshman Karya,Shakthi Kanth Karthick,Pocket Cinema,Murali Sharma,Naresh,Indraja,Tulasi,S Thaman,Latest Telugu Movie Teasers,2018 Telugu Movie Teasers, movies, enteertainment, tollywood

mega family only heroine niharika's happy wedding to draw huge crowds to theaters as it has been issued U certificate by the cencor board.

కుటుంబసమేతంగా హ్యాపీ వెడ్డింగ్.. సెన్సార్ ‘యు’ సర్టిఫికేట్

Posted: 07/14/2018 07:11 PM IST
Niharika s happy wedding gets u certificate

మెగా ఫ్యామిలీకి చెందిన ఏకైక హీరోయిన్ నిహారిక నటిస్తున్న రెండో చిత్రం హ్యాపీ వెడ్డింగ్.. ఈ నెలాఖరులో సినిమా ధీయేటర్లకు రానుంది. అయితే ఈ చిత్రంపై మాత్రం అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అందుకు కారణం ఈ సినిమాకు ఫ్యామిలీ అడియన్స్ పెద్ద సంఖ్యలో వస్తారని, వారే ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారని అటు మెగా అభిమానులతో పాటు ఇటు చిత్ర నిర్మాణ యూనిట్ కూడా అశలు పెట్టుకుంటుంది.

ఎందుకలాగా అంటారా.. సుమంత్ అశ్విన్ హీరోగా .. నిహారికతో కలసి నటిస్తున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాన్ని కూడా ముగించేసుకుంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపోందుతున్న 'హ్యాపీ వెడ్డింగ్' సినిమా.. అందమైన ప్రేమకథాగా మలచడంలో దర్శకుడు సఫలమయ్యాడని కూడా టాక్ వినబడుతుంది. దీంతో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'యు' సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆనంద్ పాత్రలో సుమంత్ అశ్విన్ .. అక్షర పాత్రలో నిహారిక కనిపించనున్నారు.

అక్షర పాత్రను చాలా వైవిధ్యభరితంగా తీర్చిదిద్దారనీ .. ఈ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని నిహారిక భావిస్తోంది. ఈ పాత్రలో ఆమె అదరగొట్టేసిందనేది యూనిట్ సభ్యుల మాట. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సుమంత్ అశ్విన్ .. నిహారిక ఇద్దరూ కూడా ఈ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles