A fan decodes Naga Chaitanya's tattoo అభిమానిని సందిగ్ధంలో పడేసిన సమంత..

Fan explains naga chaitanya s tattoo and even samantha is wowed

naga chaitanya tattoo, naga chaitanya tattoo meaning, samantha, naga chaitanya, samantha naga chaitanya pics, samantha about naga chaitanya, samantha interview, tollywood, movies, entertainment

fans of Naga Chaitanya and Samantha were wondering about the cryptic tattoo of Chay that is inked on his left forearm. Finally, a Twitter user called Harshita, who is a die-hard fan of Chaitanya has decoded the meaning.

అభిమానిని సందిగ్ధంలో పడేసిన సమంత..

Posted: 05/30/2018 07:03 PM IST
Fan explains naga chaitanya s tattoo and even samantha is wowed

టాలీవుడ్‌ ప్రేక్షకుల అదరాభిమానాలు పోందిన క్రేజీ కపుల్స్ లో అక్కినేని నాగచైతన్య, సమంత కూడా ఒకరు. లెటెస్టుగా ఒక్కటైన ఈ జంటకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో అభిమానులు చాలా శోధనలు కూడా చేస్తుంటారు. అయితే చాలామంది వీరాభిమానులు తమ ప్రశ్నలను సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటారు. సమంత అభిమానులపై ఇష్టంతో వాటికి తరచూ సమాధానాలు ఇస్తుంటారు. ఈ క్రమంలో ఒక అభిమాని నుంచి వచ్చిన ట్వీట్ సమంత కంటపడింది.

దానికి అమె సమాధానం.. చమత్కారంగా ఇచ్చింది. కానీ అభిమాని మాత్రం సందిగ్థంలో పడ్డారు. మ్యాటర్ లోకి ఎంటర్ అయితే. చైతన్య, సామ్‌ తమ చేతులపై ఒకే ఆకారంలో టాటూ వేయించున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు గతంలో వైరల్‌ అయ్యాయి. అయితే చైతన్య రెండు రోజుల క్రితం తన తండ్రి నాగార్జున నటించిన ‘ఆఫీసర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ఆయన ఫొటోలు క్లిక్‌ మనిపించింది. వీటిలో చైతన్య చేతికి ఉన్న టాటూకు కింది వైపుగా డాట్స్ కనిపించాయి. దీంతో చైతన్య కొత్త టాటూ వేసుకున్నారంటూ ఫొటోలు చక్కర్లు కొట్టడం మొదలైంది.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని చైతన్య కొత్త టాటూపై శోధించాడు. ఎట్టకేలకు దానికి అర్థం కూడా కనుక్కుని ట్వీట్ చేశారు. ‘చివరికి టాటూ అర్థం తెలుసుకున్నా. ఇది మోర్స్ కోడ్‌ (డాట్స్‌ రూపంలో రాసే భాష. గూఢచారులు ఎక్కువగా వాడుతుంటారు). దాని అర్థం 6-10-17.. ఇది చైసామ్ పెళ్లి రోజు. నేను తప్పుగా చెప్పి ఉంటే సరి చేయండి చైతన్య, సమంత’ అని ట్వీట్ చేశారు. దీనికి సమంత ప్రతి స్పందిస్తూ.. ‘వావ్ నీకు చాలా ఆతృతగా, ఆసక్తిగా ఉన్నట్లు ఉంది.. కదూ’ అని నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. మరి నిజంగా టాటూ అర్థం అదేనా అనే విషయాన్ని మాత్రం సమంత స్పష్టం చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya tattoo  samantha  die hard fan  tollywood  entertainment  

Other Articles