Sushmita Sen caught a boy misbehaving with her లైంగికదాడిని ధీటుగా ఎదుర్కొన్న సుస్మితా సేన్..

Sushmita sen caught a 15 year old boy misbehaving with her

miss universe, sushmita sen, misbehaviour, molester, 15-year old boy, award function, 24 years, movies, entertainment, bollywood

Sushmita revealed how she was shocked to see a 15-year old boy misbehaving with her. She also went ahead to reveal how she caught him red-handed and decided to teach him a lesson.

లైంగికదాడిని ధీటుగా ఎదుర్కొన్న సుస్మితా సేన్..

Posted: 05/21/2018 04:30 PM IST
Sushmita sen caught a 15 year old boy misbehaving with her

సరిగ్గా 24 ఏళ్ల క్రితం ఇదే రోజున వందలాది మంది పోటీదారుల ఎదుట.. వేలాది మంది ప్రేక్షుకుల సమక్షంలో అమె తలపై ఓ కిరీటాన్ని బహుకరించారు నిర్వాహకులు. అదే విశ్వసుందరి కిరీటం. ఈ సందర్భంగా అమె తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను వెల్లడించింది. అమె ఎవరో అర్థమైవుంటుంది కదూ. అమె ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి సుస్మితాసేన్. ముంబైలో జరిగిన 'మేక్ యార్ సిటీ సేఫ్' కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఘటన గురించి వివరించారు. '6 నెలల క్రితం నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఒక అవార్డుల ఫంక్షన్ లో ఓ కుర్రాడు నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ ప్రదేశమంతా రద్దీగా ఉండటంతో... ఎవరూ గుర్తించరని అతను అనుకున్నాడు.

కానీ, వెనకనుంచి అతని చేతిని నేను పట్టుకున్నా. అతన్ని చూసి నేను షాక్ అయ్యా. ఓ 15 ఏళ్ల వయసు ఉంటుందేమో అతనికి. ఆ తర్వాత అతని మెడను పట్టుకుని పక్కకు లాక్కెళ్లా. నేను గొడవ చేసి, నీ గురించి అందరికీ చెబితే, నీ లైఫ్ ఏమవుతుందో తెలుసా? అని ప్రశ్నించా. దీంతో, అతను సారీ చెప్పాడు. మరోసారి ఇలా చేయనని అన్నాడు. దీంతో, అతని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతనిపై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేశా' అని సుస్మిత తెలిపింది. అయితే, ఇలాంటి వాళ్లను వదిలిపెట్టకపోవడమే మంచిదని అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh