Director Durga Nageswara Rao passed away టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Director durga nageswara rao passed away

durga nareswara rao, director, ill-health, hit family movies, passed away, no more, tollywood, movies, entertainment

Renowned Director of yesteryears, who is much familiar with hit family and emotional movies, Durga Nageswara Rao passed away

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Posted: 05/17/2018 10:27 AM IST
Director durga nageswara rao passed away

సినీప్రముఖులు తమ అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చి అనంతలోకాలకు తరలివెళ్తున్నారు.  ఇటీవలే ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి అభిమానులను కలిచివేయగా, తాజాగా నిన్నటితరం ప్రముఖ దర్శకుడు దుర్గా నాగేశ్వరరావు కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్, రామాంతపూర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబకథా చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్రవేసుకున్న నాగేశ్వరరావు కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుల్లో ఒక్కరే.

దాసరి దర్శకత్వంలో వచ్చిన దేవుడే దిగివస్తే చిత్రానికి కో డైరెక్టర్ గా పనిచేసిన దుర్గా నాగేశ్వరరావు.. బొట్టు కాటుక, సుజాత, స్వర్గం,పసుపు-పారాణి వంటి విజయవంతమైన కుటుంబ కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినిమా రంగంలోకి కాస్త ఆలస్యంగానే వచ్చిన ఆయన విజయబాపినీడు నిర్మాణ సారథ్యంలో 1979లో వచ్చిన విజయ చిత్రంతో దర్శకుడుగా మారారు. చేసింది కేవలం 14 సినిమాలే అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక బాణీ ఏర్పరచుకున్నారు. 1980ల చివర్లో వచ్చిన కొందరు కొత్త కుర్రాళ్లను ఆయన బాగా ప్రోత్సహించారనే పేరు తెచ్చుకున్నారు.

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం దుర్గా నాగేశ్వరరావుకు నివాళులు అర్పించింది. ఆయనతో పాటు, కొద్ది రోజుల క్రితం మరణించిన మరో ప్రముఖ దర్శకుడు ఈరంకి శర్మ, సీనియర్ కో డైరెక్టర్ రామ సూరిలకు దర్శకుల సంఘం శ్రద్ధాంజలి ఘటించింది. ప్రధాన కార్యదర్శి రామ్ ప్రసాద్ , సీనియర్ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఈ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఈరంకి శర్మ ద్వారా వెండి తెరకు పరిచయమైన నటులు జీవీ నారాయణ రావు, హేమ సుందర్, రూపా దేవిలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కర్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత కానూరి, దర్శకులు ధవళ సత్యం, సీవీ రావు, పర్వతనేని సాంబశివరావు, గార సత్యంలు దివంగత దర్శకులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles