మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రంగస్థలం’ చిత్రం ఈ నెల 30న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రానికి ఇవాళే సెన్సార్ బోర్డు కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు.. సుకుమార్ దర్శకత్వంతో వస్తున్న ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసి.. మెగా అభిమానులతో విషయాన్ని పంచుకుంది.
పంచ వ్యాప్తంగా ‘రంగస్థలం’ విడుదలకు ఇప్పటికే సన్నాహాలు జరిగిపోయాయి. అయితే ఇది తన కెరీర్ లోనే అత్యుత్తమ చిత్రమని రామ్ చరణ్ తేజ చెప్పడంతో.. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకోన్నాయి. ఇక దీనికి తోడుగా ఎస్ఎస్ రాజమౌలి కూడా టీజర్ తో చిట్టబ్బాయి తనకు మరింత దెగ్గరయ్యాడని ట్విట్ చేయడంతో అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ సరసన సమంత నటిస్తోంది. ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, జగపతిబాబు , అనసూయ, అది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
(And get your daily news straight to your inbox)
Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more
Dec 09 | అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ... Read more
Dec 09 | సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని... Read more
Dec 09 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం అలా రోటీన్ గా కాకుండా అటు సూపర్... Read more
Dec 09 | ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా వెండితెరపై మెరిసిన త్రిష తాజాగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఎం.శరవణ్... Read more