charmi experiances love failure, not intrested in marriage ప్రేమ విఫమైంది నిజమే.. పెళ్లికి దూరం అంటోంది..

Charmi experiances love failure not intrested in marriage

actress charmi, producer charmi, charmi, punjab, charmi kaur, charmi love failure, charmi marriage, tollywood, viral news, trending news

tollywood actress Charmi Shocking Revelations About her failed love relation. “I am very happy in my personal and professional life. With Jyothi Lakshmi, I turn a producer and I am looking forward to making this a career too.:" Charmi said.

ప్రేమ విఫమైంది నిజమే.. పెళ్లికి దూరం అంటోంది..

Posted: 03/26/2018 06:42 PM IST
Charmi experiances love failure not intrested in marriage

దేశ అర్థిక రాజధాని ముంబైలో పుట్టి పెరిగిన పంజాబీ బ్యూటీ చార్మి కౌర్ ప్రేమ విఫలమైంది. అవునండీ ఈ విషయాన్ని అమె స్వయంగా వెల్లడించింది. అంతేకాదు ప్రేమ విఫలం కావడంతో తనకు పెళ్లిపై కూడా నమ్మకం లేదని చెప్పింది. విఫలమైన తన ప్రేమ, పెళ్లిపై ఆసక్తి లేకపోవడానికి గల కారణాలను ఆమె బయటపెట్టింది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, రెండు విషయాల వల్ల తమ ప్రేమ విఫలమైందని చెప్పింది. ఒకవేళ, అతన్ని తాను పెళ్లి చేసుకున్నట్టయితే ఆ రెండు విషయాల కారణంగా తాము విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడేదని తెలిపింది.

అయితే, అతను మంచివాడేనని, తానే చెడ్డదానినని చెప్పడం చార్మీ ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తుందని చెప్పడానికి నిదర్శనమే. అయితే పెళ్లి చేసుకోమని తనపై తన తల్లి ఒత్తిడి చేస్తూ ఉంటుందని, రిలేషన్ షిప్ లో సరిగ్గా ఇమడలేని తాను పెళ్లి చేసుకుని ఏం సాధిస్తానని చెప్పింది. ఒకవేళ తాను పెళ్లి చేసుకున్నా తన భర్త కోసం సమయం కేటాయించలేనని, ఇంటి పనులు చూసుకోలేనని ఛార్మి స్పష్టం చేసింది. అసలు, తనకు పెళ్లిపై నమ్మకం లేదని, ‘పెళ్లి’ అనేది తన విషయంలో జరగని పని అని చెప్పిన ఛార్మి, తన తల్లిదండ్రులతోనే ఉండిపోవాలని అనుకుంటున్నట్టు చెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles