జబర్దస్త్ యాంకర్ గా తెలుగు ప్రేక్షకులలో తనదైన గుర్తింపును తెచ్చుకున్న అనసూయ ఇటు సినీ నటిగా కూడా అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా వుంది. అలాంటి ఓ హాట్ యాంకర్ కు.. మరో యాంకర్ తోడైతే.. అందులోనూ సభలోనే అశువుగా కౌంటర్లు వేసే వారైతేనూ.. ఆ కాంభినేషన్ ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది. అలాంటి కాంబినేషన్ నిన్న విశాఖలో చోటుచేసుకుంది. తన అభిమానహీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో నటించేందుకు సిద్దమైనా.. అతనికి అత్త పాత్ర చేయడంలో కొంత సంశయానికి గురైనా ఎట్టకేలకు తన పాత్రను పూర్తి చేశానని అనసూయ నిన్నటి కార్యక్రమంలో చెప్పుకోచ్చింది.
అయితే అశువుగా కధల అల్లే టాలెంట్ వున్న మరో యాంకర్ సుమ.. అక్కడికక్కేడే అనసూయకు కౌంటర్ ఇచ్చింది. తనను కూడా ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు అక్కగా తీసుకోవాలని ముందుగా అనుకున్నారని, కానీ తనలాంటి నటిని తీసుకుంటే చెల్లిగా తీసుకోవాలి కానీ, అక్కగా తీసుకుంటే బాగుండదని తీసుకోలేదని సుమ చమత్కరించింది. అనంతరం అనసూయకి శుభాకాంక్షలు చెబుతూ 'రంగమ్మత్త' అంటూ ఆటపట్టించింది. దీంతో అనసూయ 'నేను మా చిట్టిబాబుకి మాత్రమే రంగమ్మత్తని' అని చెప్పింది. అంతేకాదు ఈ కౌంటర్ తో అనసూయ కన్నా తాను చాలా యంగ్ అని కూడా సుమ చెప్పేసుకుంది.
ఇక ఫిబ్రవరి అరవ తేదీన సామాజిక మాద్యమాలతో తనకున్న బంధాలను తెంచేసుకున్న నటి, యాంకర్ అనసూయ ఇవాళ మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఓ చిన్నారి తన ఫోటో తీస్తుంటే.. సెల్ ఫోన్ లాక్కుని పగలగొట్టి, దుర్భాషలాడిందంటూ ఓ మహిళ గతంలో అనసూయపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనతో అమెపై నెటజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు చిన్నారి పిల్లలంటే ఇష్టమని తాను అలాంటి పనులకు పూనుకోను అని చెప్పినా నెట్ జనులు అమెను ట్రాల్ చేశారు.
దీంతో నెటిజెన్ల వ్యవహారశైలిపై విరుచుకుపడిన అమె.. తాను ఇక సోషల్ మీడియాకు దూరంగా వుంటానని చెప్పి ఫిబ్రవరి 6న తన అకౌంట్లను డిజేబుల్ చేసింది. తాజాగా ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఫేస్ బుక్ అకౌంట్ ను నిన్న యాక్టివేట్ చేసి, 'రంగస్థలం' ట్రైలర్ ను అప్ లోడ్ చేసిన అనసూయ.. ట్విట్టర్ అకౌంట్ సోమవారం యాక్టివేట్ చేసింది. 'రంగస్థలం'లో తాను పోషించిన రంగమ్మత్త ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో మళ్లీ అనసూయకు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూనే వున్నారు. మరి హాట్ యాంకరా.. మజాకా.?
(And get your daily news straight to your inbox)
Jan 27 | మెగాస్టార్ చిరంజీవి.. సెన్సెషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఆచార్య. కరోనా అన్ లాక్ నేపథ్యంలో అన్ని చిత్రాలు తమ షూటింగ్ ను పూర్తి చేసుకుని ఏకంగా విడుదలకు... Read more
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more