Theatre Owners Call off Strike in Telugu States | థియేటర్ల బంద్ ముగిసింది.. మరి సినిమాలేవీ?

Theatre owners call off strike

Theatres Strike, Call Off, Theatre Owners, Digital Service Providers, Theatres Strike Call Off, Tamil Film Producer Council, AP TS Theaters

Theatre owners call off strike in Telangana and Andhra Pradesh. After reaching an agreement with Digital Service Providers, cinemas in Telangana and Andhra Pradesh called off their strike. But the Tamil Film Producer Council has still not backed down.

ఎట్టకేలకు థియేటర్ల బంద్ విమరణ

Posted: 03/07/2018 05:01 PM IST
Theatre owners call off strike

థియేటర్ల బంద్ ముగిసింది. వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్) ఛార్జీలు, కట్ ఆఫ్ టైమ్ తగ్గింపు విషయంలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (డీఎస్‌పీ) దక్షిణాది సినీ నిర్మాతలకు మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. ఇరు వర్గాల మధ్య ఈ రోజు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఛార్జీల విషయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఎస్ఐఎఫ్‌సీసీ) ఐక్య కార్యాచరణ సమితి (జాక్)-డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది. 

డిజిటల్ ప్రొజక్షన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వీపీఎఫ్‌ను తగ్గించేందుకు డీఎస్‌పీలు అంగీకరించాయి. ఫలితంగా నిర్మాతల జాక్, ప్రదర్శనకారులు తమ సమ్మెను విరమించుకునేందుకు నిర్ణయించుకున్నారు. రేపటి నుంచి సినిమాలు యథావిధిగా ప్రదర్శితమవుతాయి. కాగా, ఏప్రిల్ 6 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. వారం రోజుల బంద్ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1700 థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే.

అయితే థియేటర్లు తెరుచుకోనున్నప్పటికీ.. బంద్ కారణంగా చాలా వరకు సినిమాలు తమ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకోవటంతో.. కొత్త సినిమాలు లేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గని కోలీవుడ్ నిర్మాతలు మాత్రం బంద్ కొనసాగిస్తామని చెప్పటం విశేషం. 

థియేటర్ల బంద్ కు పిలుపు

రేపటి నుంచి థియేటర్లు బంద్ : సురేష్ బాబు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles